Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతితో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. అయినప్పటికీ.. ప్రభాస్ మారుతితో మరో చిత్రానికి సైన్ చేశాడని తెలుస్తోంది. మారుతి ఏమి చేసినా బిజినెస్ పరంగా మంచి లాభాలు వచ్చే విధంగా చేస్తాడు. పైగా నిర్మాతలకు లాభాలు వచ్చే సినిమాలే చేస్తాడు.

అన్నిటికీ మించి కింద స్థాయి నుంచి రావడంతో మారుతికి మాస్ పల్స్ బాగా తెలుసు. అందుకే, మారుతితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా సముఖంగా ఉంటున్నారు. అందుకే, ప్రభాస్ కూడా డేట్లు ఇచ్చాడు. అయితే, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయిందని కొత్త రూమర్ వినిపిస్తోంది. తమిళ స్టన్నింగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యిందట.
Also Read: బాలయ్యతో కాలేజీ ఎమోషనల్ డ్రామా.. వర్కౌట్ అవుతుందా ?
కాగా ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించబోతున్నారట. ఆ ఇద్దరిలో ఒకరు బాలీవుడ్ నుంచి ఉండొచ్చు అని.. కియారా అద్వానీని హీరోయిన్ గా ఫైనల్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారట. ఇక మూడో హీరోయిన్ గా సౌత్ హీరోయినే ఉండనుంది. ఇక డైరెక్టర్ గా మారుతి బాగా సక్సెస్ అయినా.. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వలేదు. ఒక్క వెంకటేష్ మాత్రమే డేట్స్ ఇచ్చాడు. కానీ, వెంకీతో మారుతి పెద్ద డిజాస్టర్ చేశాడు.
అయితే, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో భారీ విజయం సాధించి మొత్తానికి తనలో మ్యాటర్ ఉందని బలంగా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా “పక్కా కమర్షియల్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని.. అందుకే, ప్రభాస్ కూడా మారుతితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.

అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా మారుతితో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని ఆ మధ్య పుకార్లు వినిపించాయి. మొత్తమ్మీద మారుతి మాత్రం తన తదుపరి చిత్రాల గురించి ఊహాగానాలు వద్దు అని మీడియాకి క్లారిటీగా చెబుతున్నాడు. పైగా ఈ సారి తన కెరీర్ గ్రాఫ్ పెరిగే సినిమానే చేస్తాను అంటూ హింట్ కూడా ఇస్తున్నాడు. కాకపోతే సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తాను అంటున్నాడు. మరి ఆ సమయం ఎప్పుడు వస్తోందో చెప్పలేదు.
Also Read: ఫిబ్రవరి 25న ‘గని’గా రానున్న వరుణ్ తేజ్ !