https://oktelugu.com/

Rashmika Mandana: రష్మిక పై ఆ సీన్స్ తీస్తారట.. రణబీర్ కూడా రెడీ !

Rashmika Mandana: అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ వంగ.. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో ఈ సినిమాలో చిత్రబృందం హీరోయిన్‌గా రష్మికను కన్ఫర్మ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా ఒక సైన్స్ స్టూడెంట్ గా కనిపించబోతుంది. హీరో […]

Written By:
  • Shiva
  • , Updated On : May 9, 2022 / 09:50 AM IST
    Follow us on

    Rashmika Mandana: అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ వంగ.. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో ఈ సినిమాలో చిత్రబృందం హీరోయిన్‌గా రష్మికను కన్ఫర్మ్‌ చేసిన సంగతి తెలిసిందే.

    Sandeep Reddy, Ranbir Kapoor

    ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా ఒక సైన్స్ స్టూడెంట్ గా కనిపించబోతుంది. హీరో పాత్రకు ఆమె పాత్రకు మధ్య సైన్స్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉంటాయట. వచ్చే వారం నుంచి రష్మిక – రణబీర్ కపూర్ ల పై ఈ సీన్స్ ను షూట్ చేస్తారట. ఇప్పటికే పుష్పతో నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకుంది రష్మిక.

    Rashmika Mandana

    Also Read: Somu Veeraju: టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే.. బీజేపీ స్టాండ్ ఏమిటి?

    ఇప్పుడు ఈ సినిమాతో ఆమె క్రేజ్ రెట్టింపు కానుంది. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను దర్శకుడు ప్లాన్ చేయగా.. ఇందుకోసం పూజా హెగ్డేను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. రంగస్థలంలో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన ఆమె.. ‘యానిమల్’ కోసం అంగీకరిస్తుందో? లేదో? చూడాలి మరి.

    Pooja Hegde

    యాక్షన్‌, క్రైమ్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో రణబీర్‌తో పాటు అనిల్ కపూర్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. అలాగే సీనియర్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అనిల్ కపూర్ – రణబీర్ కపూర్ – బాబీ డియోల్ కాంబినేషన్ మల్టీస్టారర్ అంటే.. ఫుల్ క్రేజ్ ఉంటుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్‏లో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

    ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్ అని ప్రీ-లుక్ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ‘హీరో తన తండ్రిని తరువాతి జీవితంలో తన కొడుకుగా జన్మించమని .. ఆ తర్వాత మళ్ళీ తండ్రిగా జన్మించమని కూడా అడుగుతాడు. అంటే.. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా ఈ సినిమా. ఇక మునుపెన్నడూ రాని సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమాని తీస్తున్నారని బాలీవుడ్ మీడియాలో బాగా టాక్ నడుస్తోంది.

    Also Read: Suriya- Director Bala Movie: కృతి శెట్టితో పాటు ఆమె కూడా రెడీ.. జ్యోతిక జోక్యం లేదు !

    Recommended Videos:

    Tags