Rajinikanth: హీరో రజినీకాంత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం. దేశంలోనే అతిపెద్ద హీరో. కోట్లాది మంది అభిమానులకు ఆయన ఆరాధ్య దైవం. ఓ సాధారణ బస్ కండక్టర్ గా ఉన్న ఆయన పట్టుదల, కృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారు. దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. రజినీకాంత్ ని బీట్ చేసే హీరో వేరొకరు లేరు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఆయన. రజినీకాంత్ గత చిత్రం జైలర్ బ్లాక్ బస్టర్ కాగా… రూ. 210 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. అయితే ఓ హీరోయిన్ రజినీకాంత్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే వార్త ఆర్చర్యానికి గురిచేస్తుంది.
అవును ఇది నిజమే ఒక స్టార్ హీరోయిన్ రజినీకాంత్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుందట. తలైవా ని బీట్ చేసిన హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారా. ప్రస్తుతం స్టార్స్ గా రాణిస్తున్న దీపికా పదుకొనె, నయనతార, సమంత, రష్మిక మందన వంటి హీరోయిన్స్ కూడా ఓ టైర్ టు హీరోకి మించి తీసుకోరు. ఈ క్రమంలో ఆ హీరోయిన్ ఎవరనే సందేహం మీకు రావచ్చు. ఇప్పుడున్న హీరోల్లో రజినీకాంత్ ని బీట్ చేసే సత్తా ఏ హీరోకి లేదు.
ఇక హీరోయిన్లు అంటే అది సాధ్యం కాని పని. 20 మంది స్టార్ హీరోయిన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ మొత్తం ఒక రజినీకాంత్ తీసుకుంటారు. మనం మాట్లాడుకుంటున్నది రజినీకాంత్ కెరీర్ ప్రారంభంలో జరిగిన సంఘటన గురించి. 1975లో రజినీకాంత్ నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. 1976లో వచ్చిన మూండ్రు ముడిచ్చు ఆయన నటించిన నాలుగో చిత్రం. అప్పటికి రజినీకాంత్ కి అంత ఫేమ్ లేదు. రజినీకాంత్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు.
లెజండరీ దర్శకుడు కె విశ్వనాథ్ తెరకెక్కించిన ఓ సీత కథ చిత్రానికి మూండ్రు ముడిచ్చు తమిళ రీమేక్. కమల్ హాసన్, శ్రీదేవి, రజినీకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. అప్పటికే కమల్ హాసన్ హీరోగా ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. మూండ్రు ముడిచ్చు శ్రీదేవికి హీరోయిన్ గా తొలి చిత్రం. అందువల్ల కమల్ హాసన్, శ్రీదేవి కంటే రజినీకాంత్ రెమ్యునరేషన్ చాలా తక్కువట.
కమల్ హాసన్ ఈ సినిమాకి రూ. 30000 తీసుకున్నారట. హీరోయిన్ గా చేసిన శ్రీదేవికి 5000 ఇచ్చారట. కాగా రజినీకాంత్ కి కేవలం రూ. 2000 ఇచ్చారట. మూండ్రు ముడిచ్చు అప్పట్లో సూపర్ హిట్. ఈ మూవీ రజినీకాంత్ కెరీర్ కి ప్లస్ అయ్యింది. హీరోతో సమానమైన పాత్ర రజినీకాంత్ కి దక్కింది. అనంతరం సోలో హీరోగా అవకాశాలు దక్కించుకున్న రజినీకాంత్ స్టార్ అయ్యారు. స్టైల్ రజినీకాంత్ కి ప్రత్యేక తెచ్చింది. మాస్ హీరో అంటే రజినీకాంత్ అని చెప్పొచ్చు. రజినీకాంత్ జనరేషన్ హీరోలు చాలా మంది ఫేడ్ అవుట్ అయ్యారు. ఆయన మాత్రం ఇంకా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నారు.
Web Title: This star heroine charged more than super star rajinikanth
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com