Tollywood: జాతకం మారుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ జాతకం మారలేదు. హీరోగా ఇక నిలబడటం కష్టమే అని అభిప్రాయం అందరిలో రోజురోజుకు పెరిగిపోతోంది. ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి ముచ్చట్లు చేశాడు. కానీ అప్పుడు అనుకోకుండా ఆలస్యం అయింది. ఇప్పుడు ఫేడ్ అవుట్ దశలో ఉన్నాడు. ఇక తనకు నచ్చిన అమ్మాయి ప్రేమకు కూడా దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంతకీ ఎవరు గురించి ఇదంతా అంటే.. ఓ యంగ్ హీరో గురించి. అతని సినిమా నిన్న రిలీజ్ అయింది. సినిమాలో మ్యాటర్ లేదు అని క్రిటిక్స్ తేల్చి పారేశారు.

మొత్తానికి సినిమా కాస్త డిజాస్టర్ సర్టిఫికెట్ ను సమర్థవంతంగా తెచ్చుకోగలింగింది. నిజానికి ఓ పెద్ద బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా ఆ సినిమా పై అంచనాలు క్రియేట్ అవుతాయి. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ సినిమాకు తమ వంతు సహాయ సహకారాలు అంధించడమికి తాపత్రయ పడతారు. కానీ ఎందుకో ఈ హీరో సినిమాకి ఎవరూ సపోర్ట్ చేయలేదు. సదరు పెద్ద బ్యానర్ కూడా అసలు సినిమాను పట్టించుకోలేదు.
కాస్టింగ్ తో సంబంధం లేకుండా మొదటి రోజు సినిమా చూసే ప్రేక్షకులు కూడా.. ఈ హీరోగారి చిత్రాన్ని పక్కన పెట్టేశారు. చివరకు సంపూర్ణేష్ బాబు అనే దిగువస్థాయి నటుడి చిత్రానికి కూడా జనం వెళ్లారు గానీ, పాపం ఈ యంగ్ హీరో సినిమాను మాత్రం పట్టించుకోలేదు. అయినా మొదటి ఆట చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి అతను ఏమి స్టార్ కాదు కదా.
చిన్నగా కలెక్షన్స్ వస్తాయిలే అని ఎంత సర్దిచెప్పుకోడానికి లేదు. వచ్చే వారం బాలయ్య బాబు అఖండ సినిమా రాబోతుంది. కాబట్టి.. మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్. ఇక అఖండ ప్రవాహంలో ఈ చిన్న హీరో సినిమా గల్లంతు అయినట్టే. అయినా సినిమా ఎలా పడితే అలా తీస్తే చిన్న హీరోల చిత్రాలను పక్కన పెట్టేస్తున్నారు. తీసుకున్న కథలో కొత్తదనం లేకపోయినా పర్వాలేదు. మంచి కామెడీ ఉండాలి.
Also Read: Marakkar: డిసెంబరు 3న థియేటర్లలో అడుగుపెట్టనున్న సముద్ర సింహం
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమాలో దిగువస్థాయి కామెడీ కూడా లేదు. కానీ పక్కా కామెడీ అంటూ టచప్ ఇచ్చారు. ఆ టచప్ కాస్త చివరకు ప్యాచప్ అయిపోయింది. వినోదం పంచుతుందనుకున్న ఈ సినిమా, వినోదం కాదు కదా ఏ అనుభూతిని అందించలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కాబట్టి.. ఇక సదురు చిన్న హీరోగారికి భవిష్యత్తు లేనట్టే.
Also Read: Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల…