Mahesh Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా కథ గురించి ఫ్యాన్స్ ఊగిపోయే అప్ డేట్ వచ్చింది. ఇంతకీ కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో మహేష్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తాడట. మిడిల్ క్లాస్ సమస్యల నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది.

అటు మహేష్ కూడా వరుసగా సక్సెస్ లు అందుకున్నాడు. అందుకే, ఈ సినిమాకి ఇండియా వైడ్ గా మార్కెట్ అయ్యే అవకాశం ఉంది. ఇక గతంలో వీరి కలయికలో వచ్చిన ‘అతడు’ చిత్రం బుల్లితెర పై సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత చేసిన ‘ఖలేజా’ కూడా బుల్లితెర పై రికార్డ్ స్థాయిలో ఆడింది. అందుకే ఓటీటీ సంస్థలు వీరి కలయికలో రానున్న ఈ సినిమా కోసం పోటీ పడుతున్నాయి.

పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు కూడా ఉంటాయట. ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి. అందుకే, ఈ సినిమాలో యాక్షన్ అండ్ రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు త్రివిక్రమ్.
కాగా హారికా హాసిని క్రియేషన్స్ నిర్మణంలో రానున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటించబోతుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది.