Tollywood industry: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పుడైతే ఇండస్ట్రీ లో టాప్ లెవల్లో ముందుకు సాగుతుంది. ఇక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రెండు రాష్ట్రాలలో ఉన్న అన్ని ఏరియాల నుంచి దర్శకులు, హీరోలు,టెక్నీషియన్స్ ఉన్నారు. కానీ ఒకప్పుడు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే గోదావరి జిల్లాల వారిదే ప్రత్యేకమైన స్థానంగా ఉండేది. ముఖ్యంగా తూగోజి, పగోజి ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఇండస్ట్రీలో రాణించడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్లకి ధవలేశ్వరం ప్రాజెక్టు ఉండడం వల్ల నీటి కొరత ఉండేది కాదు. దాంతో సంవత్సరానికి రెండు మూడు పంటలు పండించేవారు. దాంతో వాళ్ళ దగ్గర అవసరానికి మించిన డబ్బులు ఉండేవి వాటితో కొంతమంది పిల్లలను చదివిస్తే మరి కొంతమంది తమకున్న కళలలో రాణించాలనే ప్రయత్నం చేసేవారు. ఇక అందులో భాగంగానే వాళ్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం దొరికింది. ఇక అలాగే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ లోనే ఉండేది… వాళ్లకు మద్రాస్ వెళ్లడానికి రైలు సౌకర్యం అలాగే రోడ్డు సౌకర్యం ఉండడంతో తరచుగా వాళ్ళు మద్రాస్ వెళ్లి వస్తుండేవారు. ఇక వాళ్లకు మద్రాస్ దగ్గరైపోయింది. దాంతో అక్కడికి వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసి సక్సెస్ సాధించడానికి వాళ్ళకి ఎక్కువ ఆస్కారం ఉండేది…
ఆ సమయంలో మిగతా ప్రాంతాల వాళ్ళు మూడు పూటల తిని బతకడమే కష్టంగా ఉండేది. వాళ్లకు సరైన నీటి సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడుతూ బతుకును ఈడ్చుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వాళ్ళు ఎవరు సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ఇక గోదావరి జిల్లాలు అందంగా ఉంటాయి.
కాబట్టి కొన్ని సినిమాల షూటింగ్ లను అక్కడే జరిపించడం వల్ల ఆ షూటింగ్స్ చూసిన ప్రతి ఒక్కరు సినిమా వాళ్ళ క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకొని మనం కూడా ఇండస్ట్రీకి వెళ్లాలనే ఒక కుతూహలం పుట్టేది… ఇలా సినిమా ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గోదావరి జిల్లాల వాళ్లే ఇండస్ట్రీలో స్థిరపడి ఉండటం వల్ల వాళ్ళ సహకారంతో చాలామంది ఇండస్ట్రీకి వచ్చి స్థిరపడ్డారు.
ముఖ్యంగా దాసరి నారాయణ రావు లాంటి దర్శకుడు సైతం తన ఏరియా వాళ్ళను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ తన శిష్యులుగా జాయిన్ చేయించుకోవడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఇప్పటికి దాసరి శిష్యులమే అని చెప్పుకుంటూ ఉంటారు. రాజమౌళి, సుకుమార్, వివి వినాయక్, త్రివిక్రమ్, శ్రీను వైట్ల లాంటి దర్శకులు సైతం గోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం…