Heroines Worked With Father And Son: సినిమా అంటేనే మాయలోకం. ఎమోషన్స్ తో కదిలించే ఫిక్షనల్ డ్రామా. ఐతే, ఈ డ్రామాల్లో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల జీవితాల్లో ఎన్నో డ్రామాలు జరుగుతాయి. వాళ్లకు ఫలానా హీరోతోనే నటించాలి అని షరతులు వర్తించవు. హీరోయిన్ల కెరీర్ మహా అయితే ఓ పదిహేను ఏళ్లు మాత్రమే ఉంటుంది. అందుకే.. కెరీర్ మొదట్లో కుర్ర హీరోలతో రొమాన్స్ చేసి.. ఆ తర్వాత సీనియర్ హీరోల సరసన ఒదిగిపోతారు. ఈ క్రమంలోనే కొందరు అందాల భామలు ఇటు కొడుకులతోనూ అటు తండ్రులతోనూ రొమాన్స్ చేశారు. మరి ఆ హీరోయిన్లు ఎవరు ? ఏ సినిమాల్లో వాళ్ళు తండ్రి, కొడుకుల సరసన నటించారు తెలుసుకుందాం రండి.
అతిలోక సుందరి శ్రీదేవి :
శ్రీదేవి అంటేనే.. భూలోకాన విసరబూసిన అందాల ఉషోదయం. అమృతం తాగిన సోయగంలా అందాలను దేవలోకం నుంచి పోగేసుకొచ్చిన ‘అతిలోక సుందరి’ ఆమె. అందుకే, అందమైన సినీ రంగుల ప్రపంచంలో ఎప్పటికీ ధ్రువతారగా నిలిచిపోతుంది శ్రీదేవి. ఈ అందాల ఆరాధన దేవిత, అక్కినేని నాగేశ్వరరావుకు జోడీగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కాలంలో ఏఎన్నార్ కుమారుడు అక్కినేని నాగార్జునతో కూడా రొమాన్స్ చేసింది. ఆఖరుపోరాటం, గోవిందా గోవిందా లాంటి చిత్రాల్లో శ్రీదేవి – నాగ్ కలిసి నటించారు.
Also Read: Hero Raja: హీరో రాజా సినిమాలు మానేసేందుకు అసలు కారణం ఏంటి?
మిల్కీబ్యూటీ తమన్నా :
తమన్నా భాటియా గత దశాబ్ద కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చెక్కిన పాలరాతి శిల్పం లాంటి గ్లామర్ తో అటు తెరపైన, ఇటు తెర బయట కూడా అందాల సంచలనంగా మారింది. కాగా ఈ మిల్కీబ్యూటీ కూడా రామ్‌చరణ్‌తో రచ్చ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ సినిమాలో నటించి.. అలరించింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తో భోళాశంకర్ అనే సినిమాలో నటిస్తోంది.
అందాల చందమామ కాజల్ :
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన కెరీర్ స్టార్టింగ్ లో రామ్‌చరణ్ కు జోడీగా మగధీర చిత్రంలో నటించి మెప్పిచింది. అలాగే, చరణ్ సరసన నాయక్ అనే సినిమాలోనూ ఆడిపాడింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో నటించి అలరించింది.
టాల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ :
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. హీరో నాగచైతన్యతో కలిసి రకుల్ ‘రారండోయ్ వేడుకచూద్దాం’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి ‘మన్మథుడు 2’లో నటించి ఆకట్టుకుంది. కానీ, రకుల్ – నాగ్ జంటపై విమర్శలు వచ్చాయి.
హోమ్లీ గర్ల్ లావణ్య త్రిపాఠి :
హోమ్లీ గర్ల్ లావణ్య త్రిపాఠి ఛాన్స్ లు కోసం ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చాన్స్ లు కావాలని తెగ ఆశ పడుతుంది. ఐతే, ఈ సొట్టబుగ్గల సుందరి కూడా మొదట ‘నాగచైతన్య’తో ఓ సినిమా చేసింది. ఆ తర్వాత నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో నటించింది.
మాధురి దీక్షిత్ :
మాధురి దీక్షిత్ సినీ కెరీర్ కొత్త హీరోయిన్లకు ఓ ప్రేరణ. మొదట్లో హీరోయిన్ గా పనికిరాదు అన్నారు. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగామాధురి దీక్షిత్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఐతే, మాధురి దీక్షిత్ కూడా రిషి కపూర్ తో ఓ సినిమాలో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత అతని కొడుకు రణబీర్ కపూర్‌తో కూడా కలిసి నటించింది.
రాణి ముఖర్జీ :
బాలీవుడ్ అందాల భామ రాణి ముఖర్జీ కూడా బిగ్‌బీ అమితాబచ్చన్ తో, అలాగే ఆ తర్వాత అభిషేక్ తో కలిసి నటించింది.
అమృత సింగ్ :
హీరోయిన్ అమృతసింగ్ కూడా ఇటు ధర్మేంద్రతో, అటు కొడుకు సన్నీడియోల్ తోనూ రొమాన్స్ చేసింది. ఈ లిస్ట్ లో సీనియర్ హీరోయిన్ రాధా కూడా ఉంది. ఆమె శివాజీ గణేషన్‌తో పాటు ఆయన కొడుకు ప్రభుతో కూడా కలిసి నటించింది. అలాగే కీర్తి సురేష్ కూడా అటు హీరో విక్రమ్‌తోనూ ఆ తర్వాత విక్రమ్ కొడుకు ధృవ్ తోనూ కలిసి నటించింది. మొత్తానికి అటు తండ్రి, ఇటు కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.
Also Read:Megastar Chiranjeevi: చిరంజీవి చిరిగిన చొక్కాతోనే తాళి ఎందుకు కట్టాల్సి వచ్చింది?