spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్!

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్!

Prabhas: బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి ఆ రేంజ్ మూవీ రాలేదు. కనీసం హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ పడలేదు. సాహో, రాధే శ్యామ్ ప్రేక్షకులను నిరాశపరిచాయి. సాహో కొంత బెటర్. హిందీలో రూ. 150 కోట్లకు పైగా వసూళ్లతో హిట్ స్టేటస్ అందుకుంది. వరల్డ్ వైడ్ రూ. 450 కోట్ల వసూళ్ల వరకు సాహో రాబట్టింది. రాధే శ్యామ్ మాత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ భారీ మొత్తంలో నష్టాలు మిగిల్చింది. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్ కమ్ బ్యాక్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

Prabhas
Prabhas

 

ఆదిపురుష్ మూవీతో వాళ్ళ దాహం తీరుతుందని నమ్మకంగా ఉన్నారు. ఆదిపురుష్ సంక్రాంతికి విడుదలవుతుందన్న వార్త వాళ్ళను సంతోషంలో నింపింది. సినిమా పండుగగా చెప్పుకునే సంక్రాంతికి ప్రభాస్ సంచలనాలు చేస్తారని ఫ్యాన్స్ విశ్వాసంతో ఉన్నారు. అయితే వాళ్ళ ఆశలపై మేకర్స్ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిస్తుంది.

2023 జనవరి 12న ఆదిపురుష్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు చాలా కాలం క్రితమే ప్రకటించారు. అనూహ్యంగా మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారట. ఆదిపురుష్ సమ్మర్ కి పోస్ట్ ఫోన్ అయ్యిందంటూ డిస్ట్రిబ్యూటర్స్ హింట్ ఇస్తున్నారు. ఆదిపురుష్ విడుదల వాయిదా అనివార్యమే అంటూ టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ తగిలినట్లే. పెద్ద పండుగ నాడు అభిమాన హీరో మూవీ సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాలన్న ఆశలకు గండిపడ్డట్లే.

Prabhas
Prabhas

ఆదిపురుష్ టీజర్ తీవ్ర విమర్శలపాలైన నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. సమయం తీసుకొని మెరుగైన అవుట్ ఫుట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని బావిస్తున్నారేమో అనిపిస్తుంది. టీజర్లో రామునిగా ప్రభాస్, రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్స్ విమర్శల పాలయ్యాయి. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ చాలా నాసిరకంగా టీవీ సీరియల్స్ ని తలపించింది. ప్రభాస్ లాంటి హీరోతో కార్టూన్ మూవీ తీశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ చిత్రాన్ని వీలైనంత మేర గొప్పగా మలిచే ప్రయత్నం చేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version