Viral Photo : ఈమధ్య కాలంలో సినిమాల్లో కనిపించే చైల్డ్ ఆర్టిస్ట్స్ ని ఒక రెండు మూడేళ్ళ తర్వాత అసలు గుర్తు పట్టలేకపోతున్నాం. ఈ తరం చిన్న పిల్లల్లో ఆ రేంజ్ మార్పులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ముఖ్యంగా ఆడ పిల్లలు అయితే అసలు గుర్తుపట్టలేని రేంజ్ లో మారిపోతున్నారు. 2016 వ సంవత్సరం లో అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు వరుస ఫ్లాప్స్ లో ఉన్న అక్కినేని నాగార్జున ని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చిన సినిమా ఇది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’ వంటి చిత్రాలు విడుదలై పోటీ పడ్డాయి. కానీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ వసూళ్ల సునామీ ముందు నిలబడలేకపోయాయి. ఆరోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.
ఈ చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని ఎవరైనా గుర్తు పట్టారా?, టైటిల్ సాంగ్ లో ఈ అమ్మాయి కనిపిస్తుంది. చూసేందుకు ఎంతో ముచ్చటగా కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు ప్రణవి. ఈమె ఈ చిత్రం తర్వాత అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మాయి ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజీ కొడుకు హీరో గా నటించిన ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ అమ్మాయి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూస్ బాగా వైరల్ అయ్యాయి. అమ్మాయి చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంది, చూసేందుకు అందంగా ఉంది, కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని అనుకున్నారు. అన్ని అనుకున్నట్టుగా ఆ సినిమా పెద్ద హిట్ అయ్యుంటే ఈ అమ్మాయి పేరు మారు మోగిపోయేదేమో.
కానీ బ్యాడ్ లక్, ఆ చిత్రం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. అంత పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఈ అమ్మాయి చూసేందుకు క్యూట్ గా ఉండడంతో అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఈమె మాత్రం మొదటి సినిమా ఫెయిల్యూర్ ని పాఠం లాగా తీసుకొని చాలా జాగ్రత్తగా సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయిపోయింది. ఈసారి కొడితే హిట్ కొట్టాలి, ఇండస్ట్రీ లో హీరోయిన్ గా నాటుకుపోవాలి అనే కసితో ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సుమారుగా 16 లక్షల మంది ఈమెని ఫాలో అవుతున్నారు. దీనిని బట్టి ఈమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. మీరు కూడా ఆమె లేటెస్ట్ లుక్స్ ని చూసేయండి.
View this post on Instagram