Photo Story: యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన వాళ్లు ఇప్పుడు మంచి మంచి పోజిషన్లో ఉన్నారు. కొందరు సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తే.. మరికొందరు సహానటులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు టీవీల్లో కేవలం సిరీయల్స్ మాత్రమే ప్రసారమయ్యేవి. అలాంటి సమయంలో యాంకర్లకు పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఆ సమయంలో ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటి వరకు స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న ఓ నటి సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేకంగా నిలుస్తారు. పదునైనా మాటలతో ఎలాంటి వారినైనా ఇంప్రెస్ చేయగల వాక్చాతున్యం ఉన్న ఈమెకు సంబంధించిన ఓ చిన్ననాటి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ భామ ఎవరో తెలుసా?
మాలీవుడ్ తో కోలీవుడ్ ఇండస్ట్రీకి అనుబంధం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చిన వాళ్లా స్టార్లుగా ఎదిగారు. ఇప్పడొస్తున్న హీరోయిన్లు ఎక్కువగా కేరళకు చెందిన భామలే కావడం విశేషం. అయితే 1980 కాలంలోనే కేరళ నుంచి తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది సుమ. మొదట్లో సీరియల్స్ లో నటించిన సుమ ఆ తరువాత యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లోనూ నటించిన ఈమె తనకు యాంకర్ గానే గుర్తింపు వచ్చింది.
దూరదర్శన్ లో ప్రసారం చేసేందుకు దేవదాస్ కనకాల డైరెక్షన్ చేసిన ‘మేఘమాల’ అనే సీరియల్ లో మొదటిసారిగా నటించింది సుమ. ఈ సమయంలోనే రాజీవ్ కనకాలతో ప్రేమలో పడి ఆ తరువాత 1999లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ సీరియల్ లో ఫేమస్ అయిన తరువాత సుమ కొన్ని కార్యక్రమాలకు యాంకర్ గా చేశారు. ఆ తరువాత ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా హిట్టు కాకపోవడంతో సుమకు గుర్తింపు రాలేదు.
తనకు సినిమాల కంటే యాంకర్ గానే కలిసొస్తుందని భావించిన సుమ తిరిగి అదే ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చారు. సుమ యాంకర్ గా చేసిన క్యాష్, స్టార్ మహిళ తదితర కార్యక్రమాలు విజయవంతంగా సాగాయి. అప్పటికీ, ఇప్పటికీ సుమ నెంబర్ వన్ యాంకర్ గానే కొనసాగుతున్నారు. కొన్ని నెలల కిందట సుమ డైరెక్షన్లో ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమాను కూడా తీశారు. ఇలా అన్ని రకాలుగా సక్సెస్ అవతున్న సుమ చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉండేవారు. అలనాటి ఆమె ఫొటో ఒకటి బయటరకు రావడంతో వైరల్ గా మారుతోంది.