Guess This Actor: అతడో బాలీవుడ్ స్టార్ హీరో. అప్పుడప్పుడే పైకి వస్తున్న కథానాయకుడు. వరుస సినిమాలో బిజీ అయిపోయాడు. కానీ అంతలోనే కెరీర్ కు దెబ్బ తగిలింది. మంచి పొజిషన్ లో ఉన్న సమయంలోనే తన మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అనుకోలేదు. విధి ఆడిన వింత నాటకంలో అతడి జీవితం మధ్యలోనే ముగుస్తుందని అనుకోలేదు. హీరోగా ప్రస్థానాన్ని కొనసాగించాల్సిన అతడు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం కలిగించింది.
ఇప్పటికే అర్థమై ఉంటుంది. అతడెవరో అని తెలిసిపోయింది కదా. అతడి పేరు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. సీరియళ్ల ద్వారా తన ప్రస్థానాన్ని కొనసాగించి 2008లో కిస్ దేశ్ మే హై దిల్ అనే సీరియల్ లో నటించాడు. తరువాత పవిత్ర రిస్త అనే మరో సీరియల్ లో నటించాడు. 2013లో కాయ్ పోచే అనే సినిమాతో వెండితెరపై తన ముద్ర వేశాడు. ఎంఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన బయోపిక్ లో కూడా హీరోగా చేసి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
తరువాత కాలంలో సినిమా కెరీర్ ఒడిదుడుకులకు గురైంది. దీంతో తట్టుకోలేకపోయాడు. అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో వైరాగ్యం చెందిన సుశాంత్ డ్రగ్స్ బానిసయ్యాడు. కెరీర్ ను నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా జీవితం ప్రశ్నార్థకంగా మారింది. తట్టుకోలేక 2020 జూన్ 14న ముంబైలోని బాంద్రాలోని తన ప్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఎందకు ఆత్మహత్య చేసుకున్నాడో మూడేళ్లుగా అంతుచిక్కడం లేదు.
చిత్రపరిశ్రమలో డెత్ మిస్టరీలు కోకొల్లలుగా జరిగాయి. వాటిని తేల్చడంలో ఎవరు కూడా కృతకృత్యులు కాలేదు. దీంతో చాలా మంది మరణాలు అంతు చిక్కకుండా పోయాయి. అంచెలంచెలుగా ఎదిగిన స్టార్లు సైతం ఆత్మహత్యలకు దిగడం సంచలనం కలిగించింది. టాలీవుడ్ టు బాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సుశాంత్ చిన్ననాటి ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. నవ్వులు చిందిస్తున్న పిల్లాడి ఫొటో చూస్తే అందరికి బాధ కలిగించడం మామూలే.