నిర్మాతలు : మహేష్ కోనేరు, సృజన్ యరబోలు
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: తమ్మి రాజు
డిఫరెంట్ కాన్సెప్ట్ తో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వచ్చిన సినిమా ‘తిమ్మరుసు’. నిర్మాతలు మహేశ్ కోనేరు, సృజన్ సి ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ :
లాయర్ రామచంద్ర (సత్యదేవ్) పేదవాడికి కూడా న్యాయం జరగాలని భావించే సిన్సియర్ లాయర్. ఈ క్రమంలో అరవింద్ అనే క్యాబ్ డ్రైవర్ (చైతన్య) హత్య కేసులో ఇరికించబడి అన్యాయంగా ఎనిమిదేళ్ళు శిక్షను అనుభవించిన వాసు అనే కుర్రాడికి న్యాయం చేయడానికి మళ్లీ ఆ కేసును రీఓపెన్ చేస్తాడు. మరి రామచంద్ర, వాసు ఏ తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేశాడు ? ఈ ప్రాసెస్ లో అతనికి లాయర్ అను (ప్రియాంక) ఎలాంటి సాయం చేసింది ? ఇంతకీ క్యాబ్ డ్రైవర్ ను హత్య చేసింది ఎవరు ? అసలు క్యాబ్ డ్రైవర్ అరవింద్ కి, రామచంద్రకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? చివరకు రామచంద్ర ఈ కేసును గెలిచాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
లాయర్ రామచంద్రగా ఈ సినిమాలో సత్యదేవ్ పవర్ ఫుల్ పాత్రలో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సత్యదేవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్ మాడ్యులేషన్ తో తన పాత్రకు ఫర్ఫెక్ట్ న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ పాత్రలో ఓకే ఎమోషన్ తో సాగే ప్రియాంక నటన కూడా పరవాలేదనిపిస్తోంది. అలాగే సత్యదేవ్ చనిపోయిన తన అన్నయ్య గురించి చెప్పే భావోద్వేగ సీన్స్ కూడా బాగున్నాయి. విలన్ పాత్రలో నటించిన నటుడు ఆ పాత్రకు తగ్గట్లే తన లుక్స్ ను తన ఫిజిక్ ను చాలా బాగా మార్చుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
అయితే, ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనది కాకపోయినా.. కనీసం ఇంట్రస్ట్ గా అయిన సాగి ఉంటే బాగుండేది. మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయాడు దర్శకుడు. ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ క్రైమ్ డ్రామాలు గుర్తుకువస్తాయి. అన్నిటికీ మించి సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు. సినిమాలో ఎక్కువ భాగం ఇన్విస్టిగేషన్ తో సాగినా.. ఎక్కడా వాట్ నెక్స్ట్ అనే టెన్షన్ ను బిల్డ్ చేయలేకపోయారు.
ప్లస్ పాయింట్స్ :
సత్యదేవ్ నటన,
కథ,
నేపథ్య సంగీతం,
కొన్ని సస్పెన్స్ సీన్స్,
చివర్లో వచ్చే ట్విస్ట్ లు.
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ ప్లే,
రొటీన్ డ్రామా,
హీరోయిన్ ట్రాక్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
సినిమా చూడాలా ? వద్దా ?
రొటీన్ క్రైమ్ డ్రామా వ్యవహారాలతో సాగినా.. ఈ సినిమాలో ఇన్విస్టిగేషన్ తో సాగే సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే సత్యదేవ్ నటన అండ్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ సినిమా చూడొచ్చు.
రేటింగ్ : 2.5