Tollywood: ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చిన ఆ మూవీ ప్రేక్షకులకు నచ్చితేనే దానిని సక్సెస్ చేస్తారు. లేకపోతే మాత్రం సినిమా డిజాస్టర్ గా మారాల్సిందే… స్టార్ క్యాస్టింగ్ తో పనిలేదు మంచి కంటెంట్ తో వస్తే కొత్త హీరోలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక ఈ సంవత్సరం యానిమేషన్ సినిమాగా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ సినిమా విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించింది. మౌళి లాంటి యూట్యూబర్ హీరో గా మారి చేసిన ఈ సినిమా రెండున్నర కోట్లు పెట్టి తెరకెక్కిస్తే 30 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. కాబట్టి ఈ సినిమా ఈ సంవత్సరం చిన్న సినిమాల్లో భారీ సక్సెస్ ని సాధించిన సినిమాగా భారీ రికార్డు ను క్రియేట్ చేసింది…ఇదే సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘హరిహర వీరమల్లు’ భారీ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికి డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్ డమ్ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ఇప్పుడు ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు సైతం ఒక సినిమా సక్సెస్ కి కారణాలు ఏంటి? అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరో ఉంటే సినిమాని చూస్తారా? మూవీ బాగున్నప్పుడు సినిమాని ఆదరిస్తారా? ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది…
వాళ్ళు ఏ సినిమాలను ఆదరిస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… నిజానికి సినిమాలో స్టార్ హీరో ఉన్నా లేకపోయిన కంటెంట్ బాగుండి దర్శకుడు ఆ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసినట్టయితే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే రొటీన్ రొట్ట కథలు లేకుండా డిఫరెంట్ కథలతో, మెస్మరైజింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కి వావ్ అనే సీన్స్ ఒక మూడు నాలుగు ఉండాలి.
అలాగే ఎలివేషన్ ఎమిషన్ సన్నివేశాలు బ్యాలెన్స్డ్ గా ఉండేవిధంగా చూసుకుంటే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది… అంతే తప్ప స్టార్ హీరోలు ఉన్నంత మాత్రాన ఏ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా మారిపోదు. ఈ విషయాన్ని చాలా సంవత్సరాల నుంచి చాలామంది గొప్ప వ్యక్తులు చెబుతూనే వస్తున్నారు. ఇక ఇప్పుడు మనం కూడా మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
అందుకే రైటర్లకు వాల్యూ ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటూ గొప్ప కథలను రాస్తారు… స్క్రీన్ ప్లే తో వండర్స్ ని చేస్తారు. అలా కాకుండా మా వల్లే సినిమా ఆడుతోందని హీరోలు అనుకుంటూ మేం లేకపోతే సినిమా ఉండదు అనే భావన ఉన్నన్ని రోజులు నాసిరకం కథలతో సినిమాలు వస్తాయి. అవి డిజాస్టర్లుగా మారతాయి తప్ప సూపర్ సక్సెస్ లను మాత్రం సాధించావు…