Bigg Boss 6 Telugu- Rohit: బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్స్ కి అత్యంత కీలకమైన ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు వివిధ లెవెల్స్ ని దాటుకొని ఇప్పుడు చివరి దశకి చేరుకుంది..ఈ చివరిదశ కూడా బిగ్ బాస్ సంచాలక్స్ గా వ్యవహరిస్తున్న కీర్తి – ఇనాయ – శ్రీ సత్య ని ఏకాభిప్రాయం తో 5 మంది కంటెస్టెంట్స్ లో ఇద్దరినీ తీసేయాల్సిందిగా చెప్తాడు..అప్పుడు వీళ్ళ ముగ్గురు ఏకాభిప్రయం తో రేవంత్ ,రోహిత్ మరియు ఫైమా ఈ లెవెల్ లో పోటీపడబోతున్నారని బిగ్ బాస్ కి చెప్తారు.

అప్పుడు శ్రీహాన్ -ఆది రెడ్డి సంచాలక్స్ తో గొడవకి దిగుతారు.. కష్టపడి ఇన్ని పాయింట్స్ తెచ్చుకొని మేము తొలగిపోవాల్నా..ఇదెక్కడి న్యాయం అంటూ ఆరోపిస్తుంటారు..ఆ గొడవని మొత్తం గమనించిన రోహిత్ ‘సంచాలక్స్ తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు..నేనే న్యాయంగా ఈ లెవెల్ నుండి తప్పుకుంటున్నాను’ అని చెప్తాడు..అప్పుడు సంచాలక్స్ మరోసారి చర్చించుకొని ఫైమా ని తొలగిస్తున్నట్టు ప్రకటిస్తారు.
ఫైమా ప్రస్తుతం సోషల్ మీడియా లో జరుగుతున్న అనధికారిక పోలింగ్ లో అందరికంటే తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ కి దగ్గర్లో డెంజర్ జోన్ లో ఉంది..ఈ వారం ‘టికెట్ 2 ఫినాలే’ లో టాస్కులో ఆమె గెలిస్తే ఎలిమినేషన్ ని తప్పించుకొని ఫైనల్స్ కి వెళ్తుంది..గత వారం లో కూడా ఫైమా కి తక్కువ ఓట్లు వచ్చినట్టు అధికారికంగా నాగార్జున కూడా చూపించడం తో ఈ వారం ఎలిమినేట్ అయిపోయేది ఆమెనే అని ఫైమకి కూడా అర్థం అయిపోయింది..దీనితో టాస్కు నుండి తొలగిపోవడం తో ఆమె తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది..అప్పుడు సంచాలక్స్ లో ఒకరిగా వ్యవహరించిన ఇనాయ బిగ్ బాస్ కి ‘రోహిత్ తీసుకున్న నిర్ణయం వల్ల వేరే దారిలేక మేము ఫైమా ని టాస్కు నుండి తప్పిస్తున్నాము బిగ్ బాస్’ అని చెప్తుంది.

అప్పుడు రోహిత్ ‘నేను తప్పుకోవడం వల్ల ఫైమా ని తొలగిస్తున్నాము అని చెప్పడం కరెక్ట్ కాదు..మీకు నిర్ణయం తీసుకోవడం రాలేదు..వరస్ట్ డెసిషన్’ అంటూ గొడవకి దిగుతాడు..ఇక ఆ తర్వాత ఫిజికల్ గా ఎంతో స్ట్రాంగ్ గా ఉన్న రేవంత్ , శ్రీహాన్ మరియు ఆది రెడ్డి మధ్య నువ్వా నేనా అనే విధంగా టికెట్ 2 ఫినాలే చివరి లెవెల్ కొనసాగుతుంది..వీరిలో ఎవరు టికెట్ గెల్చుకొని ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు అనేది తెలియాలంటే రాత్రి వరుకు ఎదురు చూడాల్సిందే.