Tollywood Star Heroes: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో చాలా ముఖ్యమైన ఘట్టం.పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అని మన పెద్దలు చెప్పేది వినే ఉంటారు.అయితే పెళ్లి కి ముందు జీవితం ఒకలాగా ఉంటె పెళ్లి తర్వాత మాత్రం పూర్తిగా మారిపోతుంది. పెళ్లితో ఇద్దరి జీవితం నిండు నూరేళ్లు ముడిపడి ఉంటుంది. పెళ్లి అనేది నూరేళ్లపంట. ఇద్దరు కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల్సిన జీవితం. ఇక సినిమా ఇండస్ట్రీ లో కూడా కొంత మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోలు ఉన్నారు అలాగే మరికొంత మంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న హీరోలు ఉన్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరికొంత మంది హీరోలు మేనరికపు పెళ్లిళ్లను చేసుకున్నారు. అప్పట్లో చాలామంది హీరోలు తమ సొంత మరదలిని, మేనకోడలను పెళ్లి చేసుకునేవారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ ఎప్పటికీ రారాజుగా ఉంటారు. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అప్పట్లో అటు సినిమా ఇండస్ట్రీలోను ఇటు రాజకీయాల్లోనూ ఏలిన రారాజు ఎన్టీఆర్ గారు అని చెప్పడం లో సందేహం లేదు. ఇక ఆయన తన సొంత మేనమామ కూతురు అయిన బసవ రామ తారకం ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బసవతారకం కు కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో ఆమె కూడా పట్టుబట్టి మరి ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకున్నారట. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా తన సొంత మరదలు అయిన ఇందిరా దేవిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.
అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో స్టార్ హీరోగా ఉన్నారు. దాంతో ఇందిరా దేవి కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత కృష్ణ సినిమాలలో స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో తన సహ నటి విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ సూపర్ స్టార్ కృష్ణ తన మొదటి భార్యను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదట. ఇక టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు కూడా తన మరదలు నిర్మలాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు.
తన మొదటి భార్య చనిపోవడంతో మోహన్ బాబు తన భార్య చెల్లి అయిన నిర్మలను పెళ్లి చేసుకున్నారు. దశాబ్దాల నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఇక ఇప్పటి రోజుల్లో డైలాగు కింగ్ గా పేరు తెచ్చుకున్న సాయికుమార్ నటవారసుడు ఆది సాయి కుమార్ కూడా తన సొంత మరదల్ని పెళ్లి చేసుకున్నాడు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ కూడా తన సొంత మరదలు అయిన రజిని ని పెళ్లి చేసుకున్నాడు.