NTR: 18 సంవత్సరాలకే హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. 20 సంవత్సరాలకి రెండు బ్లాక్ బాస్టర్ హిట్ల ను తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక వరుస సక్సెస్ లను అందుకుంటూ తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు ను కూడా సంపాదించుకున్నాడు. ఇక నందమూరి వంశం నుంచి వచ్చిన మూడోతరం హీరోగా కూడా ఎన్టీయార్ చాలా కీర్తి, ప్రతిష్టలను అందుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ‘ సింహాద్రి’ సినిమా తర్వాత ఆయనతో భారీ హిట్స్ కొట్టాలని, చాలామంది స్టార్ డైరెక్టర్లు పోటీపడి మరి ఆయనతో సినిమాలు చేశారు. అయినప్పటికీ ఆ సినిమాలు ఏమీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అందులో ముఖ్యంగా ముగ్గురు దర్శకులు అయితే ఆయనతో ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీస్తాను అని చెప్పి, నమ్మించి డిజాస్టర్ సినిమాలను తీశారు. ఇక అలా తీసిన వాళ్ళల్లో బి.గోపాల్ ఒకరు. ఈయన చేసిన నరసింహుడు సినిమా మొదటి షో నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటుగా ఎన్టీఆర్ కెరియర్ లోనే అదొక వరస్ట్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఏదైనా సినిమా చేయకపోయి ఉంటే బాగుండేది అని అనుకున్న ప్రతిసారి, వాళ్లు నరసింహుడు సినిమా చేయకపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు.
ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన శక్తి సినిమా అతిపెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి. అయితే మెహర్ రమేష్ మగధీర లాంటి స్టోరీ రాశాను. దాన్ని ఢీకొట్టే ఒక అద్భుతమైన సినిమాని మీతో చేస్తానని ఎన్టీఆర్ తో చెప్పి అతన్ని నమ్మించి ఒక డిజాస్టర్ సినిమాని తీశాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత ఎన్టీఆర్ తో డిజాస్టర్ సినిమాని తీసిన మరొక దర్శకుడు బోయపాటి శీను.
ఈయన బాలయ్య తో చేసిన సింహా సినిమా సూపర్ హిట్ అవడంతో అంతకు మించిన సినిమా మీతో చేసి ఒక ఇండస్ట్రీ హిట్ అందిస్తానని బోయపాటి ఎన్టీఆర్ కి చెప్పి ఆయన కి దమ్ము అనే ఒక అల్ట్రా డిజాస్టర్ సినిమాను ఇచ్చాడు..ఇలా వీళ్ళు ముగ్గురు డైరెక్టర్లు ఎన్టీయార్ కెరియర్ లో భారీ డిజాస్టర్లు ఇచ్చిన డైరెక్టర్లు గా చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నారు…