Star heroine in Kalki 2: రీసెంట్ గానే ‘కల్కి 2’ చిత్రం నుండి హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ని తొలగిస్తున్నట్టు సినిమా నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కారణాలు ఏంటో చెప్పలేదు కానీ, మా సినిమాకు ఎంతో డెడికేషన్ తో ఉండాలి. దురదృష్టం కొద్దీ అది దీపికా పదుకొనే లో లేదు. అందుకే తొలగిస్తున్నాము అని నేరుగా చెప్పి తొలగించారు. ఇలాంటి పరిణామం టాలీవుడ్ హిస్టరీ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఏ హీరోయిన్ కి జరగలేదు. దీనిపై హీరోయిన్ దీపికా పదుకొనే నుండి రియాక్షన్ వస్తుందేమో అని అభిమానులు ఎదురు చూసారు. కానీ ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇదంతా పక్కన పెడితే ‘కల్కి’ చిత్రం అంత పెద్ద సంచలన విజయం సాధించడానికి దీపికా పదుకొనే పాత్ర కచ్చితంగా ఎంతో కొంత ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు.
ఎందుకంటే ఇంటర్వెల్ సన్నివేశం ఒక్కటి చాలు, దీపికా పదుకొనే ఆ సినిమాకు ఏమి చేసింది అనేది చెప్పడానికి. అయితే ఇప్పుడు ఆమె ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్ ని మ్యాచ్ చేసే హీరోయిన్ ఎవరు?, అంత అద్భుతంగా ఎవరు నటించగలరు అని సోషల్ మీడియా లో అభిమానులు ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మేకర్స్ ఇప్పటికే బాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. వారిలో అలియా భట్, కృతి సనన్ మరియు కియారా అద్వానీ. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కచ్చితంగా ఈ సినిమాకు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారు మేకర్స్. దాదాపుగా అలియా భట్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తున్న వార్త. అలియా భట్ అద్భుతమైన నటి, ఎలాంటి పాత్రలో అయినా ఆమె అవలీలగా ఒదిగిపోగలదు.
#RRR చిత్రం లో మనం కేవలం ఆమెలోని నటన ని ఒక్క శాతం మాత్రమే చూసాము. ఆమె బాలీవుడ్ సినిమాలు చూస్తే ఈమె కచ్చితంగా ఆ పాత్రకు న్యాయం చేయగలదు అని ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. ఇక కృతి సనన్ కూడా తక్కువేమి కాదు, క్యారక్టర్ బాగుంటే ఈమె నట విశ్వరూపం చూపిస్తుంది. అందుకే నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది. వీళ్లిద్దరి డేట్స్ కుదరకపోతే ఇక కియారా అద్వానీ ఫైనల్ అయ్యే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని అంటున్నారు మేకర్స్. కియారా అద్వానీ రీసెంట్ గానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఈమె నుండి ఎలాంటి సినిమా కూడా విడుదల అవ్వలేదు. ఒకవేళ ఈ చిత్రం ఒప్పుకుంటే ఆమె కెరీర్ కి బాగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి వీరిలో ఎవరు ఫైనల్ అవుతారు అనేది.