Guntur Karam: గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుక రద్దయింది. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగాల్సి ఉంది. చివరి నిమిషంలో ట్రాఫిక్ సమస్యలు నేపథ్యంలో పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అయితే ఇది సాకు మాత్రమే, తగు పర్మిషన్స్ ఇవ్వకపోవడం వెనుక మరొక కారణం ఉందనేది టాలీవుడ్ టాక్. కాంగ్రెస్ గవర్నమెంట్ కక్షపూరితంగా వ్యవహరించి గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుకను అడ్డుకుంది అనేది వాస్తవం అంటున్నారు.
2022లో రన్బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఏర్పాటు ఇచ్చేశారు. ఎన్టీఆర్ ఈ వేడుకకు ముఖ్య అతిథి. కాగా ఎన్టీఆర్ ఈ వేడుకకు కొన్ని రోజుల ముందు బీజేపీ నేత అమిత్ షాని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది నచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ వేడుకను అడ్డుకుంది. చివరి నిమిషంలో అనుమతులు ఇవ్వకుండా షాక్ ఇచ్చింది. ఇదే సీన్ మహేష్ విషయంలో రిపీట్ అయ్యిందనేది చిత్ర వర్గాల వాదన.
మహేష్ బాబు, త్రివిక్రమ్ మాజీ మంత్రి కేటీఆర్ కి సన్నిహితులు. వారి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. పలుమార్లు నేరుగా కలిశారు. భరత్ అనే నేను మూవీ ప్రమోషన్స్ లో కేటీఆర్ స్వయంగా పాల్గొనడం జరిగింది. కొరటాల శివ, మహేష్ బాబు, కేటీఆర్ ఒక ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. మహేష్-కేటీఆర్ బాండింగ్ గురించి తెలిసిన కాంగ్రెస్ ఇప్పుడు కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. మహేష్ బాబు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండా సాకులు చూపుతూ అడ్డుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
అలాగే మహేష్ ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమ నుండి జగన్మోహన్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన అతి కొద్ది మందిలో మహేష్ ఒకరు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి నచ్చని విషయం. వైఎస్ జగన్ యాంటీ కాంగ్రెస్ అన్న విషయం తెలిసిందే. దానికి తోడు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు శిష్యుడు. ఈ సమీకరణాల నేపథ్యంలో కక్ష సాధింపులో భాగంగానే గుంటూరు కారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదని సమాచారం.