Pawan Kalyan Remakes: పవన్ కల్యాణ్ తన కెరీర్ లో రీమేక్ లనే ఎక్కువగా నమ్ముకున్నాడు. వాటితోనే ఎన్నో హిట్లు సాధించాడు. తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో మొదలు భీమ్లా నాయక్ వరకు చాలా సినిమాలు రీమేక్ లే కావడం గమనార్హం. బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలన్ని కూడా రీమేక్ ల వల్లే కావడం విశేషం. ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగులో రీమేక్ చేస్తూ సంచలన విజయాలు అందుకోవడం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీమేక్ ల్లో నటించి తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.

మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హిందీలో అమీర్ ఖాన్ హీరోగా ఖయామత్ సే బయామత్ తక్ ను తెలుగులో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమా అంతగా ప్రజాదరణ పొందలేకపోయినా యావరేజ్ గా నిలిచింది. ఇక రెండో సినిమా గోకులంలో సీత కూడా రీమేక్ కావడం తెలిసిందే. ఇది తమిళంలో కార్తీక్ హీరోగా నటించిన గోకులతిల్ సీతై కు రీమేక్. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Also Read: Hari Hara Veera Mallu- Power Glance: తొడగొట్టాడు.. తెలుగోడు.. హరిహర వీరమల్లుగా పవన్ విశ్వరూపం

మూడో సినిమా సుస్వాగతం కూడా రీమేకే. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన లవ్ టుడే చిత్రాన్ని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తీశారు. పవన్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా రికార్డు సాధించింది. పవన్ కు మంచి క్రేజీ తీసుకొచ్చిన సినిమా తమ్ముడు కూడా రీమేక్ కావడం తెలిసిందే. ఇది హిందీలో అమీర్ ఖాన్ చేసిన జీ జోతా నహీ సికందర్ కు రీమేక్ గా తెలుగులో తీసి విజయం సాధించారు. హిందీలో సైకిల్ పోటీ అయితే తెలుగులో మాత్రం బాక్సింగ్ పోటీలపై పెట్టి దర్శకుడు బంపర్ హిట్ చేశారు.
పవన్ కు మాస్ అభిమానులను తెచ్చిన చిత్రం ఖుషి కూడా తమిళ మాతృకే. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి తెలుగు సినిమా కలెక్షన్లను కొల్లగొట్టింది. పవన్ ను యూత్ ఐకాన్ గా నిలిపింది. అన్నవరం కూడా తమిళంలో తిరుపాది గా తీశారు. దాన్ని తెలుగులో అన్నవరంగా పవన్ కల్యాణ్ నటించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. హిందీలో లవ్ ఆజ్ కల్ సినిమాను సైఫ్ అలీఖాన్ హీరోగా తీశారు. దాన్ని తెలుగులో తీన్ మార్ గా రీమేక్ చేసినా హిట్ సాధించలేకపోయింది.

హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం దబాంగ్ తెలుగులో గబ్బర్ సింగ్ గా వచ్చింది. దీనికి దర్శకుడు హరీశ్ శంకర్ కథలో కొన్ని మార్పులు చేసి పవన్ కు బ్రహ్మాండమైన హిట్ తెచ్చిపెట్టాడు. దీంతో చాలా మంది పవన్ కు ఫ్యాన్స్ అయిపోయారు. అభిమానులకు నచ్చే విధంగా కథలో అంత్యాక్షరి సన్నివేశం పెట్టి రంజింపచేశారు. విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన చిత్రం గోపాలగోపాల కూడా హిందీలో అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం కావడం గమనార్హం.

కాటమరాయుడు సినిమా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమాకు రీమేక్. ఇక వకీల్ సాబ్ సినిమా కూడా హిందీలో అమితాబ్ హీరోగా వచ్చిన పింక్ కు రీమేక్. కథలో కొన్ని మార్పులతో పవన్ కు అనుగుణంగా సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తీర్చిదిద్దడంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంకా భీమ్లా నాయక్ కూడా అయ్యప్పమమ్ కోలీయమ్ మళయాల సినిమాకు రీమేక్ అని తెలిసిందే. ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్ నటన హైలెట్. పవన్ కల్యాణ్, రానా ఇద్దరు పోటీపడి నటించారు. ఇలా పవన్ కల్యాణ్ తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు రీమేక్ లే కావడం తెలిసిందే. తన ఎదుగుదలకు కారణమైన రీమేక్ లనే ఎక్కువగా నమ్ముకున్నాడు. విజయం సాధించాడు.
Also Read:Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా?