Allu Arjun : అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఇండియాలో ఏ మూలకు వెల్లినా సరే ఈయన ఫ్యాన్స్ కనిపిస్తారు. తగ్గేదేలే అంటూ ఎక్కడ తగ్గడం లేదు పుష్ప రాజ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో తన రేంజ్ ను పూర్తిగా మార్చుకున్నారు ఈ హీరో. ఒక్కసారిగా ఆకాశానికి ఎదిగింది ఈయన ఖ్యాతి. తన నటన, స్టైల్ లతో ప్రేక్షకును మెస్మరైజ్ చేస్తుంటారు ఈ సూపర్ హీరో. సినిమా గురించి కాస్త నెగిటివ్ టాక్ ఉన్నా హిట్ టాక్ తో బాక్సాఫీస్ ను బద్దలు చేసింది. హీరో స్మగ్లింగ్ చేయడం ఏంటని ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ ఆయన అభిమానులు మాత్రం దీన్ని కొట్టిపారేశారు. ఇక పుష్ప 2 సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ తెగ ఆరాట పడుతున్నారు. ఈ రేంజ్ లో హిట్ ను సంపాదించిన బన్నీ లైఫ్ లో కొన్ని వరస్ట్ సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటంటే?.
హ్యాపీ: కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్ గంగోత్రి, ఆర్య, బన్నీ వంటి సినిమాలు చేశారు. నాలుగో సినిమాగా సొంత బ్యానర్ లో హ్యాపీ సినిమా చేశారు. జెనీలియా కథానాయికగా కరుణాకర్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. కనీసం పెట్టిన డబ్బులు కూడా రికవరీ చేయలేదు ఈ సినిమా. ఆ సినిమాలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే భావోద్వేగాలను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. లాభాలు కూడా రాని ఈ సినిమాను మళయాళంలో డబ్ చేశారు. అక్కడ విడుదలైన ఈ సినిమా మాత్రం ఏకంగా 175 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ ను అందుకుంది.
ఆర్య 2- ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే అమ్మాయిని లవ్ చేయడం, కథ కూడా నార్మల్ గా ఉండటంతో ఈ సినిమా పెద్దగా హిట్ అవలేదు. కాజల్ హీరోయిన్ అల్లు అర్జున్ హీరోగా ఉన్నా కూడా ఈ సినిమాను ఆదరించలేదు ప్రేక్షకులు. లవ్ ట్రాక్ ను సరిగ్గా రాయలేదని, స్టోరీ నచ్చలేదని ఈ సినిమాకు ఫ్లాప్ రిజల్ట్ ను అందించారు ప్రేక్షకులు.
వరుడు- వరుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఐదురోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో విలన్ గా తమిళ్ హీరో ఆర్య నటించారు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు.
వేదం- ఐదు కథల సినిమా ఇది. అయితే మొదటి భాగం మొత్తం ఆ ఐదు కథల గమ్యం ఎటువైపు పోతుందో అర్థం చేసుకునేలోపే ఇంటర్వెల్ అవుతుంది. మిగిలిన సగభాగం అందరూ ఒకేచోట కలవడంతో పూర్తి అవుతుంది సినిమా. మామూలు సినిమాకు ఇది భిన్నమైన కథ అని చెప్పవచ్చు. హీరో హీరోయిన్ల లవ్, యాక్షన్, ఫైట్లు రొటీన్ సినిమాలో ఉండేవే కానీ కొత్త ప్రయోగం. అయితే ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు.దీంతో ఈ సినిమా విషయంలో కూడా అల్లు అర్జున్ అభిమానులు తెగ ఫీల్ అయ్యారు.