https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించని నటులు వీళ్లే…

మొదటగా స్నేహం కోసం సినిమాలో విజయ్ కుమార్ పోషించిన పాత్రను చిరంజీవి ఆర్.నారాయణమూర్తితో చేయించాలని అనుకున్నాడట. ఎందుకంటే ఆర్.నారాయణమూర్తి చిరంజీవి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : February 23, 2024 / 02:02 PM IST
    Follow us on

    ఒక స్టోరీ ఎంత బాగున్నా కూడా అందులో ఒక పాత్ర సక్సెస్ కావాలంటే ఆ క్యారెక్టర్ ను పోషించే నటుడు కూడా కీలక పాత్ర వహిస్తాడు. అందుకే కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్ల కోసం కొంతమందిని మాత్రమే తీసుకోవడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ పాత్ర చేయడానికి వాళ్ళు ఒప్పుకోకపోయిన ఎలాగైనా వాళ్లని ఒప్పించి, వాళ్ల చేత నటింపజేసి సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు. అయితే చిరంజీవి చేసిన రెండు సినిమాల్లో కీలక పాత్రల కోసం చిరంజీవి ఇద్దరు నటులను అడగగా వాళ్ళిద్దరూ ఆ పాత్రలను రిజెక్ట్ చేశారు. అయితే వాళ్ళు ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    మొదటగా స్నేహం కోసం సినిమాలో విజయ్ కుమార్ పోషించిన పాత్రను చిరంజీవి ఆర్.నారాయణమూర్తితో చేయించాలని అనుకున్నాడట. ఎందుకంటే ఆర్.నారాయణమూర్తి చిరంజీవి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. కాబట్టి అది స్క్రీన్ మీద కూడా చాలా బాగా సెట్ అవుతుంది. దీనివల్ల సినిమా చూసే ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్లు ఈజీగా కనెక్ట్ అవుతాయనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఆ పాత్ర కోసం మొదట నారాయణమూర్తి ని తీసుకోవాలని అనుకున్నాడు.

    కానీ నారాయణమూర్తి మాత్రం తన సినిమాలో తప్ప మిగతా వాళ్ళ సినిమాలో నటించేది లేదని భీష్మించుకూర్చున్నాడు. కాబట్టి ఆ సినిమాలో ఆ పాత్రని ఆయన సున్నితంగా రిజెక్ట్ చేశాడట. ఇక ఫైనల్ గా ఆ పాత్రలో విజయ్ కుమార్ నటించి మెప్పించాడు…

    ఇక ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన చూడాలని ఉంది సినిమాలో విలన్ పాత్ర కోసం మొదటగా కోట శ్రీనివాసరావుని అడిగారట. తను కూడా ఆ క్యారెక్టర్ లో నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ ఫుల్ నటుడిగా గుర్తింపు పొందుతున్న ప్రకాష్ రాజ్ ను ఆ పాత్ర కోసం తీసుకున్నారు. ఇక ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ నటన చాలా కొత్తగా ఉండడంతో ఆయనకు విలన్ గా మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో చిరంజీవికి, ప్రకాష్ రాజ్ కి, గుణశేఖర్ కి ముగ్గురికి కూడా మంచి పేరు వచ్చిందనే చెప్పాలి…