Salaar OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ‘సలార్’. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఎన్నో అంచనాల నడుమ సలార్ మూవీ అన్ని భాషల్లో విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ నేపథ్యంలో థియేటర్ల వద్ద ప్రేక్షకులు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్స్ వద్ద ప్రభాస్ భారీ కట్ అవుట్స్ ఏర్పాటుచేశారు ఫ్యాన్స్. దాంతో పాటు కట్ అవుట్స్ కు భారీ భారీ పూలదండలతో వేయడంతో పాటు పాలాభిషేకాలు, డీజే బ్యాండ్ తో పండుగ వాతావరణం కన్పిస్తుంది.
Also Read: సలార్ సీజ్ ఫైర్ మూవీ ఫుల్ రివ్యూ… హిట్టా? ఫట్టా?
ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా వ్యవహరించిన సలార్ చిత్రం రెండు పార్టులుగా నిర్మించనున్నారన్న సంగతి తెలిసిందే. ఇందులో పార్ట్ 1 సీజ్ ఫైర్ ఇవాళ విడుదల అయింది. ఇద్దరు ప్రాణస్నేహితులు బద్ద శత్రువులుగా ఏలా మారారు? ఎందుకు? అన్న అంశంతో తెరకెక్కింది. కేజీఎఫ్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ ను అందించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కాంబినేషల్ వచ్చిన చిత్రం కావడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. సలార్ సినిమాలో దేవ పాత్రలో ప్రభాస్ నటించగా ఆయనకు ధీటుగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ పాత్రను పోషించారు. ఓ సందర్భంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ పృథ్వీరాజ్ లేకపోతే సలార్ మూవీ లేదని చెప్పారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. హీరోతో పాటు ఆయన పాత్ర ఎంత కీలకమన్నది. శృతిహాసన్ కథనాయకగా కనిపించగా జగపతి బాబు వంటి నటులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరోవైపు సలార్ మూవీ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధర వెచ్చించి కైవసం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే వచ్చే సంక్రాంతి పర్వదినం వరకు సలార్ సినిమా మేనియా కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మేనియా తగ్గిన తరువాత దాదాపు రెండు మూడు నెలల తరువాత సలార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Also Read: సలార్ ట్విట్టర్ రివ్యూ: ప్రభాస్ సినిమాకు ఊహించని టాక్, హైలెట్స్ ఇవే!