Mr Bachchan: మిస్టర్ బచ్చన్ మీద హైప్ అయితే కనిపించడం లేదు…కారణం ఏంటంటే..?

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన గ్లింప్స్ అయితే ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఒకటే రిలీజ్ అయింది. కాబట్టి ఈ సినిమా మీద అంత పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.

Written By: Gopi, Updated On : May 16, 2024 2:15 pm

There is no hype on Mr Bachchan

Follow us on

Mr Bachchan: ప్రస్తుతం రవితేజ “మిస్టర్ బచ్చన్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తను మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే హరీష్ శంకర్ తో కలిసి ఈ సినిమా చేయడానికి శ్రీకరం చుట్టాడు. ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన గ్లింప్స్ అయితే ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఒకటే రిలీజ్ అయింది. కాబట్టి ఈ సినిమా మీద అంత పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. మరి ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తే అప్పుడు సినిమా మీద అంచనాలైతే పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక తొందర్లోనే ఈ సినిమాకి సంభందించిన ప్రమోషన్స్ మొదలుపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా యూనిట్ చాలా వరకు లేట్ చేసిందంటూ సినిమా పండితులు సైతం ఈ సినిమా యూనిట్ మీద విమర్శలైతే చేస్తున్నారు.

ఎందుకంటే ఎంత తొందరగా సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే సినిమాకి అంత హైప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళు చాలావరకు ఆ హైప్ ను అందుకోవడంలో వెనుకబడ్డారనే చెప్పాలి. ఇక ఇప్పుడు కనక రవితేజ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే వరుసగా మూడు సినిమాలు ప్లాప్ తర్వాత ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరోగా మంచి గుర్తింపు పొందాడు.

అలాగే 2019లో వచ్చిన గద్దల కొండ గణేష్ తర్వాత మరొక సినిమా అయితే చేయలేదు.అందుకే ఈ సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో రవితేజ హరీష్ శంకర్ ఇద్దరు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది…