20 assistant directors for Spirit: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్ గానే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఆడియో టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వంగ మార్క్ అడుగడుగునా కనిపించింది. ప్రభాస్ కి కూడా ఇలాంటి పవర్ ఫుల్ రోల్ పడి చాలా కాలం అయింది అంటూ వార్తలు వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరు నుండి మొదలు కాబోతుందని స్వయంగా సందీప్ వంగ రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. మెక్సికో లో ముందు ప్రభాస్ లేని కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తారట. మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యాక, రెండవ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నారని టాక్. ఈ చిత్రం లో యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమిరి హీరోయిన్ గా నటించబోతోంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సందీప్ వంగ(Sandeep Reddy Vanga) ఏకంగా 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ని పెట్టుకున్నాడట. ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కూడా పెట్టుకోలేదు. కచ్చితంగా అసిస్టెంట్ డైరెక్టర్స్ కనీసం నలుగురు అయినా ఉంటారు కానీ, ఈ రేంజ్ లో మాత్రం ఉండేవారు కాదు. అయితే ఆ 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ లో రవితేజ తనయుడు మహాధాన్ కూడా ఉన్నాడు. ఇతనితో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి కూడా మరో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. రవితేజ తనయుడు మహాధాన్ గతం లో ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారక్టర్ చేసాడు. ఇందులో ఆయన కళ్ళు లేని వాడిగా రవితేజ కంటే చాలా బాగా చేసాడు, కుర్రాడిలో మంచి ఎనర్జీ ఉంది, సినిమాల్లో రాణిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆయన ద్రుష్టి నటన వైపు ఉండాలి కానీ, డైరేక్షన్ డిపార్ట్మెంట్ వైపు ఎందుకు వెళ్ళాడు అనేది రవితేజ ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు రిషి ఇప్పటికే యూట్యూబ్ లో అనేక షార్ట్ ఫిలిమ్స్ తీసాడు. ఫిల్మ్ మేకింగ్ మీద ఈయనకు ప్రత్యేకమైన గ్రిప్ ఉంది. ఇప్పుడు సందీప్ వంగ స్కూల్ నుండి ఎంత నేర్చుకుంటాడో చూడాలి. ఇక స్పిరిట్ విషయానికి వస్తే ఈ సినిమా కోసం ప్రభాస్ 80 రోజుల వరకు నాన్ స్టాప్ గా డేట్స్ కూడా ఇచ్చేశాడట. సాధారణంగా ప్రభాస్ ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత మరో సినిమా చేసే రకం కాదు. ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనే రకం అన్నమాట. కానీ సందీప్ వంగ అలా చేయడానికి ఒప్పుకోలేదట. దీంతో ప్రభాస్ తన ప్రస్తుత సినిమాల షూటింగ్స్ ని పూర్తి చేసి స్పిరిట్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అట.