Yadamma Raju: జబర్దస్త్ ప్రొగ్రాం ద్వారా ఫేమస్ అయిన కమెడియన్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో యాదమ్మరాజు ఒకరు. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యాదమ్మరాజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అయితే ఇటీవల ఆయన జబర్దస్త్ నుంచి సినిమాల్లో వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఆయన ఒకేసారి తనకు యాక్సిడెంట్ అయిన విషయం తెలియగానే తోటి నటులతో పాటు ఆడియన్స్ షాక్ అయ్యారు. దీంతో ఆయనకు యాక్సిడెంట్ ఎలా అయింది? అని చాలా మంది సోషల్ మీడియా ద్వారా అడిగారు. కానీ యాదమ్మరాజు మొన్నటి వరకు చికిత్స తీసుకోవడంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేకపోయాడు. తాజాగా ఆయన లేటేస్ట్ పిక్స్ బయటకు వచ్చాయి. హాస్పిటల్ నుంచి ఓ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న యదమ్మరాజు తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పాడు,
యాదమ్మరాజు లేటేస్టుగా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే సినిమాలో నటించారు. ఇందులో బ్రహ్మాజీ కుమారుడు హీరో. ఇందులోయాదమ్మరాజు కూడా కీలక పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాదమ్మరాజు చేతి కర్ర పట్టుకొని కనిపించాడు. దీంతో అదరూ యాదమ్మరాజు గురించి అడిగారు. తనకు యాక్సిడెంట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎలా జరిగింది? అన్న విషయంపై అడిడారు. సినిమా ప్రమోషన్స్ పూర్తి కాగానే తనకు యాక్సిడెంట్ జరిగిన తీరును బయటపెట్టారు.
ఈ సందర్భంగా యాదమ్మ రాజు మాట్లాడుతూ ‘ఓ టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నా. అటువైపు ఓ బైక్ వచ్చింది. అయితే నా దగ్గరికి రాగానే బైక్ స్కిడ్ అయి పడిపోయింది. దీంతో ఆ బైక్ నా కాలుపైనుంచే వెళ్లింది. అలా వెళ్లడం ద్వారా నా కాలు వేలు తెగింది. ఆసుపత్రిలోకి వెళ్లాక తొడకు సంబంధించిన స్కిన్ తీసి వేలుకు సర్జరీ చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నా’ అని యాదమ్మరాజు తనకు యాక్సిడెంట్ జరిగిన తీరును వివరించారు.
అయితే ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆసుపత్రికి సంబంధించిన ఫొటోలు బయటపెట్టారు. ఇందులో తన భార్య స్టెల్లా యాదమ్మరాజును తీసుకెళ్తూ…బెడ్ పై పడుకోబెడుతూ ఉంది. త్వరలోనే యాదమ్మరాజు కోలుకొని బయటకు రావాలని అందరూ కోరుతున్నారు. మరికొందరు తన కామెడీని మిస్ అవుతున్నట్లు మెసేజ్ పెడుతున్నారు. యాదమ్మరాజు మరికొన్ని సినిమాల్లోనూ నటించారని తెలుస్తోంది.