Pushpa-3 : పుష్ప-3 టైటిల్ ఏంటి భయ్యా మరి ఇంత వైలెంట్ గా ఉంది… సుకుమార్ ఊచకోత మొదలవ్వనుందా..?

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక సుకుమార్ కూడా రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By: NARESH, Updated On : March 28, 2024 8:16 pm

Pushpa 3

Follow us on

Pushpa-3 : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాల హవా నడుస్తుంది.ఇక ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ సాధించగా, ప్రస్తుతం పుష్ప 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా సినిమా యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ‘పుష్ప 3’ ని కూడా పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను తొందర్లోనే ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది.

ఇక రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘అన్ని అనుకున్నట్టుగా జరిగితే పుష్ప 3 సినిమాను కూడా తెరకెక్కించే అవకాశం ఉంది అని స్వయం గా తన నోటి ద్వారా ఆయనే చెప్పడం సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక ప్రస్తుతం పుష్ప 3 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక పుష్ప సినిమాలో నటించినందుకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా ‘నేషనల్ అవార్డు’ కూడా వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే పుష్ప 3 టైటిల్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలు వెలువడుతున్నాయి. ఇక అందులో భాగంగానే పుష్ప 3 టైటిల్ లీకైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప మొదటి పార్ట్ ని ‘పుష్ప ది రైజ్’ అనే పేరుతో తెరకెక్కించారు. అలాగే పార్ట్ 2 ను ‘పుష్ప ది రూల్’ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు పుష్ప 3 ని మాత్రం ‘పుష్ప ది రోర్’ అనే టైటిల్ తో తెరకెక్కించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక సుకుమార్ కూడా రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్లిద్దరూ ఈ సినిమాలను కంప్లీట్ చేసుకొని పుష్ప 3 సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే పుష్ప ఫ్రాంచైజ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది…