Jawaan Collections : మూడోరోజు కూడా జవాన్ దూకుడు… షారుక్ ఖాతాలో మరిన్ని రికార్డులు!

జవాన్ లో సరికొత్త స్టోరీ అంటూ ఏమీ లేదు. టోటల్ గా సౌత్ మసాలా మొత్తం కలిపేసి తీసిన సినిమా అది. కానీ అట్లీ తెరకెక్కించిన విధానం, హీరోకు ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు,

Written By: NARESH, Updated On : September 10, 2023 3:28 pm

Jawan Movie Bangladesh

Follow us on

Jawaan Collections : ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జవాన్ చిత్రం సునామీ సృష్టిస్తుంది. ఊహకందని వసూళ్లు సాధిస్తూ షారుఖ్ ఖాన్ సత్తా ఏమిటో మరోసారి రుజువు చేస్తుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూకుడు చూపిస్తుంది. కేవలం మొదటి రెండు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ క్లబ్ చేరి సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. షారుఖ్ ఖాన్ గత సినిమా పఠాన్ సినిమా మూడు రోజుల్లో 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. గదర్ 2 ఐదు రోజుల్లో ఈ మార్క్ ని టచ్ చేసింది.

ఇక మూడో రోజు జవాన్ వసూళ్లు విషయానికి వస్తే మొదటి రోజుకు ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్స్ సాధించింది. మొదటిరోజు ఈ సినిమా 75 నెట్ వసూళ్లు సాధిస్తే, మూడో రోజు 74. 50 కోట్లు నెట్ సాధించి హౌరా అనిపించింది. ముఖ్యంగా థియోటర్లు లో ఆక్యూపెన్సీ కూడా బాగా పెరిగింది. సాయంత్రం షోస్ కు 71 % ఉన్న ఆక్యూపెన్సీ నైట్ షోస్ వచ్చేసరికి దాదాపు 81 % కి పెరిగింది. దీనితో మూడో రోజు వసూళ్లు దానికి తగ్గట్టు వచ్చాయి.

దీనితో మొదటి మూడు రోజుల్లోనే 200 కోట్ల నెట్ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. కేవలం హిందీలో మూడో రోజు 66 కోట్లు, తమిళంలో 5 కోట్లు, తెలుగులో 3. 5 కోట్లు సాధించింది. ఓవరాల్ గా 202 కోట్లు నెట్ సాధించిన జవాన్ హిందీ లో 177 కోట్లు, తమిళం 14 కోట్లు, తెలుగు దాదాపు 11 కోట్లు వసూళ్లు సాధించి షారుఖ్ ఖాన్ సత్తా చూపిస్తుంది. ఇక ఈ సినిమా దూకుడు చూస్తే ఆదివారం ముగిసేసరికి 500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశం ఉంది.

నిజానికి జవాన్ లో సరికొత్త స్టోరీ అంటూ ఏమీ లేదు. టోటల్ గా సౌత్ మసాలా మొత్తం కలిపేసి తీసిన సినిమా అది. కానీ అట్లీ తెరకెక్కించిన విధానం, హీరోకు ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు, సినిమా BGM కావచ్చు ఇవన్నీ కలిసి జవాన్ ను మరోస్థాయిలో నిలబెట్టింది. పైగా హీరో తప్ప మిగిలిన స్టార్ యాక్టర్స్ అందరూ సౌత్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. ఇక జవాన్ సునామి ఇలాగే కొనసాగితే ఈజీగా 1200 కోట్ల క్లబ్ లో చేరటం ఖాయం.