Childhood Photo: పై ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఎవరో స్కూల్ అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది కదూ .. మాములు స్కూల్ అమ్మాయి ఇలా ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటే ఆ ఫోటో గురించి మీకెందుకు చెబుతాం.. ఆ ఫోటోకు ఓ ప్రత్యేకత ఉంది.. ఆ చిరునవ్వు వెనుక విజయ రహస్యం ఉంది. చిన్న వయసులోనే ఆమె ముఖంలో కాన్ఫిడెంట్ కనిపిస్తున్న ఈమె పెద్దయాగ కూడా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో బిజీగా మారింది. ఇంతకీ ఎవరామ్మాయి? అనేగా మీ డౌట్ అయితే కిందికి వెళ్లండి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ పాప ఎవరో కాదు హీరోయిన్ తాప్సి. తాప్సీ పన్ను స్వస్థలం ఢిల్లీ. 1987 ఆగస్టు 1 ఆమె బర్త్ డే. చదువు పూర్తయిన తరువాత మోడలింగ్ లో అడుగుపెట్టిన ఆమె తెలుగులో ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మొగుడు, ఘాజి, వస్తాడు నా రాజు, దరువు లాంటి సినిమాల్లో నటించింది. అయితే హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ఆమె వరుస సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఆమె హిందీలోనూ ‘చస్మే బద్దూర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అమితాబచ్చన్ తో కలిసి నటించిన ‘పింక్’ ఆమెకు ఇండియా లెవల్లో గుర్తింపు తీసుకొచ్చింది.
ఆ మధ్య ఐటీ అధికారులు తాప్సీ ఇంట్లో రూ.5 కోట్ల సొమ్మును కనుగొన్నారు. అయితే ఈ డబ్బు ఎక్కడివో తనకు తెలియదని తాప్సి చెప్పింది. తాను తప్పు చేసి ఉంటే శిక్షకు సిద్ధమని తెలిపింది. ఐటీ అధికారులకు తాను, తన కుటుంబం పూర్తిగా సహకరించామని స్పష్టం చేసింది. ఈ దాడులు ఎందుకు జరిగాయో ఇప్పటికీ తెలియడం లేదని తాప్సీ చెప్పుకొచ్చింది. నేను ఈ సొమ్ము ప్యారిస్ లో అందుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.కానీ అది అవాస్తవమని తాప్సీ చెప్పారు.
లేటెస్ట్ గా తాప్సికి సంబంధించిన ఓ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతుంది. ఇందులో తాప్సీ స్కూల్లో ఓ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అప్పుడే తాప్సీ అందంగా కనిపిస్తుంది. అప్పటికే ఇప్పటికి అందంలో ఏ మార్పు రాలేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా తరువాత తాప్సీ మళ్లీ కనిపించలేదు. అటు హిందీలోనూ అమ్మడుకు అవకాశాలు తగ్గినట్లు సమాచారం. అయితే తాజాగా ఆమె పేరు నెట్టింట్లో మారుమోగుతోంది.