Devara: దేవర సినిమా లో ఐటం గర్ల్ గా కనిపించబోతున్న స్టార్ హీరోయిన్…

త్రిబుల్ ఆర్ సినిమాతో సత్తా చాటుకున్నప్పటికీ అది మల్టీస్టారర్ సినిమా కావడం వల్ల ఎన్టీఆర్ కి అంత గొప్ప పెరైతే రాలేదు. ఇక దాంతో ఇప్పుడు ఆయన దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ల్లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.

Written By: Gopi, Updated On : January 17, 2024 11:13 am

Devara

Follow us on

Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్ నైనా సరే అలవోకగా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఇక తాత సీనియర్ ఎన్టీయార్ కి ఏ మాత్రం తగ్గకుండా తాత కి తగ్గ మనవడిగా దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేసే దేవర సినిమా మీద ఈయన చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవాలనే ఆలోచనలో అయితే ఉన్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో సత్తా చాటుకున్నప్పటికీ అది మల్టీస్టారర్ సినిమా కావడం వల్ల ఎన్టీఆర్ కి అంత గొప్ప పెరైతే రాలేదు. ఇక దాంతో ఇప్పుడు ఆయన దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ల్లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇక దానికి తగ్గట్టుగా ఈ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టు గా కూడా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ ని కనక చూసినట్లయితే కొరటాల శివ ఆచార్య ప్లాప్ అవడంతో ఈ సినిమాని చాలా కసిగా తీస్తున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేయడమే తను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కలుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఇప్పుడిప్పుడే తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందుతున్న మీనాక్షి చౌదరిని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమె గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. దాంతో ఈ సినిమాలో వచ్చిన గుర్తింపుతో దేవర సినిమాకి ఆమెను కొరటాల శివ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఆ సాంగ్ మాత్రం చాలా హైలైట్ గా నిలవబోతుంది అంటూ ఇప్పటికే సినిమా యూనిట్ నుంచి పలు రకాల వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుంది అలాగే సినిమా సక్సెస్ లో ఈ సాంగ్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.