Mega Family Movie: మెగా ఫ్యామిలీ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న ఆ స్టార్ డైరెక్టర్…

ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది.ఇక ప్రస్తుతం చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లతో కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాలో నటించాలని చూస్తున్నారు.

Written By: Gopi, Updated On : November 25, 2023 4:40 pm

Mega Family Movie

Follow us on

Mega Family Movie తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ లో ఉన్న చాలా మంది హీరోలు ఎవరికి వారు వాళ్ల గుర్తింపును చాటుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ల సినిమాలతో ప్రేక్షకులకి ఆనందాన్ని పంచుతూ వస్తున్నారు. ఇక ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే మనకు ముందు గా గుర్తుకు వచ్చే హీరోలు చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్…

వీళ్ళు ముగ్గురు హీరోలు కూడా వాళ్ల కంటు ఒక ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడి హృదయంలో చోటు సంపాదించుకున్నారు.ఇక దీన్ని బట్టి వాళ్ళ యాక్టింగ్ పొటేన్షియాలిటి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది.ఇక ప్రస్తుతం చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లతో కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాలో నటించాలని చూస్తున్నారు.

ఎందుకంటే ఇంతకుముందు అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి చేసిన మనం సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అలాగే చిరంజీవి ఫ్యామిలీ కూడా అంతా కలిసి నటిస్తే బాగుంటుందని అది ఒక మంచి మెమొరబుల్ సినిమాగా గుర్తుండిపోతుందని అనుకుంటున్నాడు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోలు అందరు కలిసి ఒక సినిమా చేయాలని చిరంజీవి కోరుకుంటున్నాటుగా తెలుస్తుంది.

అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ముగ్గురి ఇమేజ్ కి సెట్ అయ్యే ఒక కథ రాసుకొని చిరంజీవికి వినిపించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కనక వర్కౌట్ అయితే ఇండస్ట్రీలో రికార్డులు మొత్తం బ్రేక్ అవ్వడం పక్క అని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని, రామ్ చరణ్ ని ఓకే ఫ్రేమ్ లో చూసిన ప్రతి అభిమాని గర్వం తో కాలర్ ఎగరేయడం పక్క అని అంటున్నారు…ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది ఇప్పుడు చాలా మందికి ఒక ఎమోషన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరికి వాళ్లు ఎదగడం అనేది అభిమానులకి చాలా గొప్ప గా అనిపించే విషయం. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే ఇండస్ట్రీలో అత్యధిక మంది అభిమానులు కలిగి ఉన్న హీరోగా వెలుగొందుతున్నాడు…

ఇక వీలైనంత తొందరలో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే చూడాలని ప్రతి ప్రేక్షకుడు కూడా కోరుకుంటున్నాడు. ఇక గురూజీ ఈ సినిమాను తొందరలోనే సెట్ చేసే విధంగా కనిపిస్తున్నాడు…