Sreemukhi: సోషల్ మీడియా ఫ్యాషన్ ఐకాన్ గా మారింది యాంకర్ శ్రీముఖి. అమ్మడు గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఆమె కోటు, ప్యాంట్స్ ధరించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. శ్రీముఖి లుక్ వైరల్ అవుతుండగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బుల్లితెర గ్లామరస్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. అనసూయ, రష్మీ గౌతమ్ లు ఒక ట్రెండ్ సెట్ చేశారు. యాంకరింగ్ కి గ్లామర్ పరిచయం చేశారు. వారి స్ఫూర్తితో శ్రీముఖి బోల్డ్ యాంకర్ గా ఎదిగారు.
శ్రీముఖి హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చింది. అయితే అవకాశాలు రాలేదు. పైగా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు కూడా ఎదురయ్యాయట. లాభం లేదని శ్రీముఖి యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. పటాస్ షోతో శ్రీముఖి పాప్యులర్ అయ్యింది. యాంకర్ రవితో పాటు పటాస్ షోకి ఆమె యాంకర్ గా వ్యవహరించారు. పటాస్ పర్లేదు అనిపించుకుంది.
బుల్లితెరపై ఎదుగుతున్న రోజుల్లో శ్రీముఖి బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. 2019లో ప్రసారమైన సీజన్ 3లో శ్రీముఖి కంటెస్ట్ చేసింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా టైటిల్ రేసులో నిలిచింది. సీజన్ 3 టైటిల్ కోసం సింగర్ రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి పోటీపడ్డారు. తృటిలో టైటిల్ చేజార్చుకున్న శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. ప్రైజ్ మనీ మిస్ అయినా… రెమ్యునరేషన్ రూపంలో శ్రీముఖి గట్టిగా రాబట్టిందని సమాచారం.
బిగ్ బాస్ అనంతరం శ్రీముఖి ఫేమ్ రెట్టింపు అయ్యింది. యాంకర్ గా ఎదిగేందుకు దోహదం చేసింది. టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీముఖి పలు షోలలో సందడి చేస్తున్నారు. ఆమె యాంకర్ గా ఉన్న స్టార్ మా పరివార్ భారీ టీఆర్పీ రాబడుతుంది. ఇటీవల ఆహాలో ప్రారంభమైన కామెడీ ఎక్స్ఛేంజ్ షోకి కూడా ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు నటిగా ఆఫర్స్ పట్టేస్తుంది. వెండితెరపై, బుల్లితెరపై శ్రీముఖి దూసుకుపోతున్నారు.
View this post on Instagram