
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’.ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు గ్లిమ్స్ వీడియోలను విడుదల చెయ్యగా వాటికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మొఘల్ కాలం నాటికి సంబంధించిన కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా నటిస్తున్నాడు.
ఇప్పటికే 80 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో సరికొత్త షెడ్యూల్ ని జరుపుకుంటుంది.అయితే ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం లేదట, ఆయన లేని సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ చేస్తున్నారు.జనవరి నెల వరకు జరిగిన ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు సాగే పోరాట సన్నివేశం లో మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ ని గత నాలుగు రోజుల నుండి షూట్ చేస్తున్నారట.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 80 శాతం వరకు షూటింగ్ జరిపారట.పవన్ కళ్యాణ్ సంబంధించిన 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.త్వరలోనే పవన్ కళ్యాణ్ సెట్స్ లోకి జాయిన్ అవుతాడని, ఈ నెలలో ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసి, ఈ ఏడాది దసరా కి ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాని అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ రీమేక్ లో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో గత కొద్దిరోజుల నుండి విరామం లేకుండా సాగుతుంది.మార్చి 12 వ తారీఖు వరకు జరగనున్న ఈ షెడ్యూల్ తర్వాత పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ బ్యాలన్స్ షూటింగ్ కోసం డేట్స్ కేటాయిస్తాడని తెలుస్తుంది.