The Rajasaab: భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలను సంక్రాంతికి విడుదల చేయడం చాలా రిస్క్ అని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు. ఎందుకంటే సంక్రాంతికి నాలుగైదు సినిమాలు థియేటర్స్ పంచుకుంటాయి కాబట్టి. కలెక్షన్స్ బాగా వచ్చినప్పటికీ , అవి బడ్జెట్ ని రీకవర్ చేసే రేంజ్ లో ఉండదని అంటున్నారు. దాదాపుగా 300 కోట్ల రూపాయలతో తీసిన ‘రాజసాబ్'(The Rajasaab Movie) మూవీ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఈ చిత్రం మరో వారం రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజులు సోలో గానే ఉంటుంది కాబట్టి, ఎంత వసూళ్లను రాబట్టిన ఈ మూడు రోజుల్లోనే రాబట్టాలి. అలా రాబట్టాలంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాలి. ప్రీ ఫెస్టివల్ సీజన్ లో కలెక్షన్స్ సాధారణంగానే వీక్ గా ఉంటాయి. అలాంటి సమయం లో టాక్ రాకపోతే ఇక సర్దేయడమే అని అంటున్నారు.
‘రాజా సాబ్’ కి పోటీగా ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘జన నాయకుడు’ వంటి సినిమాలు రాబోతున్నాయి. ‘రాజా సాబ్’ తర్వాత పెద్ద సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ కాబట్టి, ఈ సినిమాకు సంబంధించిన బయ్యర్స్ ఇప్పటి నుండే థియేటర్స్ లో లాక్ చేసుకోవడం మొదలు పెడుతున్నారు. సిటీస్ మరియు టౌన్స్ లలో ఉన్నటువంటి బెస్ట్ థియేటర్స్ మొత్తం చిరంజీవి సినిమాకే వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత థియేటర్స్ ని లాక్ చేసే విషయం లో ‘అనగనగా ఒక రాజు’ చిత్రం మంచి దూకుడుని ప్రదర్శిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ కావడం తో, అతనికి శాశ్వతమైన బయ్యర్స్ ఉంటారు కాబట్టి, గణనీయమైన థియేటర్స్ ని లాక్ చేస్తున్నారు. అదే విధంగా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బయ్యర్స్ కూడా డీసెంట్ స్థాయి థియేటర్స్ ని హోల్డ్ చేస్తున్నారు.
ఇక సంక్రాంతి రేస్ లో చివరిగా వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ కి కూడా భారీ గానే థియేటర్స్ లాబీయింగ్ జరుగుతుంది. వీటి అన్నిటిని తట్టుకొని ‘రాజా సాబ్’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే చాలా పెద్ద టాస్క్. అసలే ఈ చిత్రాన్ని నిర్మాత నష్టాల్లో విడుదల చేస్తున్నాడు. బడ్జెట్ కి కావాల్సినంత బిజినెస్ మాత్రం ఈ చిత్రానికి జరగలేదు. కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ రాకపోతే సంక్రాంతి పండుగ మొదలు అయ్యేలోపే దాదాపుగా అన్ని థియేటర్స్ లో ఈ చిత్రం లేచిపోయే ప్రమాదం ఉంది. గతం లో గేమ్ చేంజర్ చిత్రానికి కూడా ఇలాగే జరిగింది. మరి ‘రాజా సాబ్’ చిత్రానికి అలాంటి పరిస్థితే రాబోతోందా లేదా మంచి రన్ వస్తుందా అనేది చూడాలి.