The Raja Saab: సరిగ్గా మరో పది రోజుల్లో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasasaab) చిత్రం విడుదల కాబోతుంది . ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ని నిన్న మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన రాజా సాబ్ కంటెంట్ ఏది కూడా అభిమానులకు నచ్చలేదు కానీ, నిన్న విడుదల చేసిన ట్రైలర్ మాత్రం తెగ నచ్చేసింది. మార్కెట్ ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం నిన్నటి నుండే మొదలైంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొన్నటి వరకు చాలా దారుణంగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం బాగా పుజుకుంది. నార్త్ అమెరికా లో గడిచిన రెండు రోజుల నుండి దాదాపుగా 50 వేలకు పైగా డాలర్స్ వచ్చాయి. ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు కొత్త ట్రైలర్ ఎఫెక్ట్ వల్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
తెలుగు వెర్షన్ వరకు కావాల్సిన హైప్ అయితే గడిచిన రెండు రోజుల్లో ఈ చిత్తానికి వచ్చేసింది. కానీ ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉండే నార్త్ ఇండియా లో మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వలేదు. అసలు ఈ సినిమా విడుదల అవుతుంది అనే విషయం కూడా నార్త్ ఇండియన్స్ కి తెలియదు. చూస్తుంటే హిందీ వెర్షన్ నుండి మొదటి రోజు కనీసం రెండు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు అయినా వస్తాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతటి దారుణమైన బజ్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు హిందీ మంచి ఓపెనింగ్ రావాలంటే , కచ్చితంగా పాజిటివ్ టాక్ అత్యవసరం. మరి ఆ టాక్ ఈ చిత్రానికి వస్తుందో లేదో చూడాలి. హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని అనిల్ తడానీ కొనుగోలు చేసాడు. ప్రభాస్ నటించిన సినిమాలు అత్యధిక శాతం సినిమాలకు ఆయనే పంపిణీదారుడిగా వ్యవహరించాడు.
ఇప్పుడు ఈ సినిమాకు ఏ రేంజ్ విడుదల ఇస్తాడో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లో జనవరి 4 నుండి మొదలు పెట్టే ఆలోచన లో ఉన్నారట. జనవరి 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల నుండే ప్రీమియర్ షోస్ ని ప్రారంబిస్తారట. ఇది సినిమాకు చాలా డేంజర్ అనే చెప్పాలి. కానీ ఈసారి టికెట్ రేట్స్ వస్తాయో లేదో అనే అనుమానం నిర్మాతల్లో ఉంది. ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్స్, ప్రీమియర్ షోస్ కి అనుమతులు ఇస్తే కేవలం 9 గంటల ఆటలు మాత్రమే జనవరి 8 న ఉంటాయి. మరి ఏమి జరగబోతుందో చూడాలి.