The Raja Saab: ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘రాజా సాబ్'(Rajasaab Movie) మూవీ అప్డేట్ వచ్చేసింది. ఎల్లుండి అనగా నవంబర్ 23వ తేదీన ఈ సినిమాలోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. బాహుబలి సిరీస్ తర్వాత అభిమానులు ప్రభాస్ ని ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాల్లో చూడడమే కానీ, డార్లింగ్, బుజ్జి గాడు, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి కాలం నాటి ప్రభాస్ ని బాగా మిస్ అవుతున్నారు. అప్పట్లో ప్రభాస్ కి మంచి కామెడీ టైమింగ్ ఉండేది, అంతే కాకుండా డ్యాన్స్ కూడా బాగా చేసేవాడు. ఈమధ్య కాలం లో ఆయన డ్యాన్స్ వేసి చాలా కాలం అయిపోయింది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చి ఊగిపోయే రేంజ్ లో ఎల్లుండి విడుదల అవ్వబోయే పాటలో డ్యాన్స్ ఉంటుందని, 2000 దశకం లో ప్రభాస్ నుండి ఎలాంటి డ్యాన్స్ స్టెప్స్ ఉండేవో, ఆ రేంజ్ డ్యాన్స్ స్టెప్స్ ఈ పాటలో చూడొచ్చని మేకర్స్ చెప్తున్నారు.
ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ లో ప్రభాస్ కామెడీ టైమింగ్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా, ఆడియన్స్ ని కూడా ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇది కదా ప్రభాస్ నుండి మేము ఇన్ని రోజులు మిస్ అవుతుంది అని ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ ట్రైలర్ కి తోడు పాట కూడా సూపర్ హిట్ అయితే ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అవుతుందని, మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు కూడా అదిరిపోతాయని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 4 నుండి ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం కాబోతుంది. కాబట్టి పాట సూపర్ హిట్ అవ్వడం అనివార్యం.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం లోని మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యింది, అదే విధంగా రామ్ చరణ్ పెద్ది లోని ‘చికిరి చికిరి’ పాట దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది, అంతకు ముందు ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం లోని ప్రతీ పాట సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మూవీ నుండి విడుదలైన ‘సంచారి’ సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇలా స్టార్ హీరోలకు సంబంధించిన ప్రతీ పాట పెద్ద హిట్ అవుతూ వస్తున్నాయి. కేవలం ప్రభాస్ మాత్రమే ఈ విషయం లో వెనుకబడ్డాడు. కాబట్టి ఈ పాటతో ఆ లోటు పూడ్చాలని, దయచేసి ఒకే ఒక్క చార్ట్ బస్టర్ ఇవ్వు అంటూ సంగీత దర్శకుడు థమన్ ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి థమన్ అభిమానుల కోరిక ని నెరవేరుస్తాడా లేదా అనేది చూడాలి.
#TheRajaSaab ka Style #RebelSaab – A song that takes you back to the 2000s darling era #TheRajaSaabOnJan9th #Prabhas@DirectorMaruthi @MusicThaman pic.twitter.com/3XSFtoOnj5
— The RajaSaab (@rajasaabmovie) November 21, 2025