Homeఎంటర్టైన్మెంట్Mana Shankara Varaprasad Garu collections: 'మన శంకర వరప్రసాద్ గారు' కి నిర్మాతలు చెప్పిన...

Mana Shankara Varaprasad Garu collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి నిర్మాతలు చెప్పిన కలెక్షన్స్ 375 కోట్లు..కానీ ఒరిజినల్ గా వచ్చిన వసూళ్లు ఇవే!

Mana Shankara Varaprasad Garu collections: ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం, భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చి, రీసెంట్ గానే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల నుండి రోజుకి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతూ, చాలా కాలం తర్వాత అద్భుతమైన లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న చిత్రం గా నిల్చింది. అంతా బాగానే ఉంది కానీ, మేకర్స్ అత్యుత్సాహంతో వేసే పోస్టర్స్ ని చూస్తే, ఈ చిత్రానికి నిజంగా వచ్చిన వసూళ్లను కూడా నమ్మే పరిస్థితులు కనిపించడం లేదంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్ వేసిన పోస్టర్స్ ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట.

కానీ నిజానికి అంత గ్రాస్ వసూళ్లు రాలేదు. 33 రోజుల థియేట్రికల్ రన్ కి గానూ ఈ చిత్రానికి 302 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. నాలుగు సినిమాలతో పోటీ పడుతూ, ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. షేర్ వసూళ్లు అయితే దాదాపుగా 182 కోట్ల రూపాయలకు పైమాటే.ఇక తెలుగు రాష్ట్రాల నుండి అయితే ఈ చిత్రానికి 231 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ హిట్ సినిమాలు ‘దేవర’, ‘ఓజీ’ కంటే ఎక్కువ గ్రాస్ అన్నమాట. 122 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ చిత్రం 60 కోట్ల రూపాయలకు పైగా లాభాలను రాబట్టు సంచలనం సృష్టించింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇంతటి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని నెలకొల్పిన ఈ చిత్రం కలెక్షన్స్ ని నిర్మాతలు విడుదల చేసిన ఫేక్ పోస్టర్స్ కారణంగా కొంతమంది నమ్మడం లేదు. కేవలం ఈ ఒక్క సినిమా విషయం లో మాత్రమే కాదు, ఈమధ్య కాలం లో ప్రతీ సినిమాకు ఇదే ట్రెండ్ ని అనుసరిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలకు అభిమానుల కోసం ఇలాంటి పోస్టర్స్ ని విడుదల చేయడం లో తప్పు లేదు, కానీ చిన్న హీరోల సినిమాలకు కూడా ఫేక్ పోస్టర్స్ ని వేస్తుంటే, ఎవరు మాత్రం నమ్ముతారు చెప్పండి. అందుకే ఇలాంటి ఫేక్ పోస్టర్స్ సంస్కృతి కి ఇకనైనా తెరదించాలి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version