Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: పుష్ప 2 పై కుట్ర, ఫేక్ ప్రచారం పై నిర్మాతలు సీరియస్.. స్ట్రాంగ్...

Pushpa 2: పుష్ప 2 పై కుట్ర, ఫేక్ ప్రచారం పై నిర్మాతలు సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్, అతిక్రమిస్తే జైలుకే!

Pushpa 2: స్టార్ హీరోల చిత్రాలపై నెగిటివ్ ప్రచారం చాలా కామన్. సోషల్ మీడియా వేదికగా సినిమాను యాంటీ ఫ్యాన్స్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఆడియన్స్ కూడా ట్విట్టర్, ఫేస్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో కనిపించే రివ్యూలు, కామెంట్స్ నిజమని నమ్ముతున్నారు. ఒక సినిమాకు ట్విట్టర్ లో పూర్తి నెగిటివ్ రివ్యూ వస్తే.. మొదటి రోజే వసూళ్లు రావడం లేదు. అంతగా సినిమా ఫలితాన్ని సోషల్ మీడియా ప్రభావితం చేస్తుంది.

కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వచ్చింది. ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. ఈ సినిమాలోని డైలాగ్స్ పై యాంటీ ఫ్యాన్స్ ఫేక్ ప్రచారానికి తెరలేపారు. పుష్ప 2 విడుదల నేపథ్యంలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లు పరిస్థితి తయారైంది. సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ తన మిత్రుడు అయిన నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలిపాడు. వైసీపీ నేత అయిన శిల్పా రవి ఇంటికి స్వయంగా వెళ్ళాడు.

ఇది జనసేనతో పాటు కూటమి పార్టీలకు నచ్చలేదు. మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి యాంటీ అయ్యారు. అదే సమయంలో దీన్ని అదునుగా చేసుకుని వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా జనసేన, వైసీపీ ఫాలోవర్స్ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ.. పుష్ప 2 మూవీలో లేని డైలాగ్స్ ని ప్రచారం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ ఈ డైలాగ్స్ తో టార్గెట్ చేశాడని వైసీపీ వాళ్ళు కొన్ని ఫేక్ డైలాగ్స్ తెరపైకి తెచ్చారు.

అదే విధంగా వైఎస్ జగన్ ని అల్లు అర్జున్ ఈ డైలాగ్స్ తో కించపరిచాడని జనసేన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాల వలన పుష్ప 2 మూవీపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. దీన్ని కట్టడి చేయాలని భావించిన నిర్మాతలు సీరియస్ అయ్యారు. మూవీలోని డైలాగ్స్, కంటెంట్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే శిక్ష తప్పదు. అకౌంట్స్ గుర్తించి సైబర్ క్రైమ్ విభాగంలో కేసులు పెడతామని హెచ్చరించారు. నిర్మాతల ప్రకటన నేపథ్యంలో ఇకనైనా పుషప్ 2 పై నెగిటివ్ ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి.

మరోవైపు పుష్ప 2 ఆల్ ఇండియా బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. రూ. 294 ఓపెనింగ్ డే వసూళ్లతో నయా రికార్డు సెట్ చేసింది. హిందీలో షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డు ని సైతం తుడిచిపెట్టింది.

RELATED ARTICLES

Most Popular