Liger Movie: టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ఆయన మార్కెట్ పెరగడంతో భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన చాలా తక్కువ టైమ్ లోనే అభిమాన సంఘాలు ఏర్పడేంత పెద్ద స్టార్ గా అవతరించాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొద్దిమంది స్టార్ హీరోల లిస్టులో ఆయన కూడా ఉన్నారు.

అయితే ఇప్పుడు ఆయన మార్కెట్‌కు మించి పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు పూరీ జగన్నాథ్. వీరిద్దరి కాంబినేషన్‌లో లైగర్ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇందులో విజయ్ బాక్సర్ గా మంచి ఫిజిక్ తో కనిపిస్తుండటంతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మొదటి నుంచి ఈ మూవీ గురించి పద్ద అప్‌డేట్లు రావట్లేదు.
Also Read: Died in 2022: 2022లో చిత్రసీమను ‘వదిలివెళ్లిన’ సినీ ప్రముఖులు..!
కానీ ఫ్యాన్స్ ను కుషీ చేస్తూ రీసెంట్ గా వదిలిన ఫస్ట్ గ్లింప్స్ అంచనాలను అమాంతం పెంచేసింది. పైగా అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా యాక్ట్ చేస్తుండటంతో విపరీతమైన హైప్ వచ్చేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ క్రేజీ మ్యాటర్ బయటకు లీక్ అయింది. అసలు ఇందులో బైక్ టైసన్ పాత్ర ఏంటో బయటకు వచ్చేసింది.
మొన్నటి వరకు మైక్ టైసన్ ఈ మూవీలో విజయ్ కు గురువుగా ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ మైక్ టైసన్ ఇందులో హీరోకు తండ్రి పాత్ర పోషిస్తున్నాడంట. ఆయన ఓ సందర్భంలో ఇండియాకు వచ్చినప్పుడు రమ్యకృష్ణతో ప్రేమలో పడతాడంట. దీంతో వీరిద్దరికీ హీరో జన్మిస్తాడట. అలా తండ్రి దారిలోనే హీరో ఆటోమేటిక్ గా నడుస్తాడని.. ఆ పరిణామంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులపై కథ నడుస్తుంది.

మొన్న వదిలిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో ఈ మూవీకి సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అంటే అమెరికన్ బాక్సర్ కు , ఇండియన్ అమ్మాయికి పుట్టిన వ్యక్తి కాబట్టి క్రాస్ బ్రీడ్ అని పెట్టారని సమాచారం. అయితే రమ్యకృష్ణను మైక్ టైసన్ పెండ్లి చేసుకుంటారా లేక సహజీవనమా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
Also Read:MLA Roja: రోజాకు దెబ్బ మీద దెబ్బ.. ఆశలన్నీ అడియాశలే..!
[…] Naina Ganguly: వర్మలో ఈ మధ్య బాగా పైత్యం ముదిరిపోయింది. వర్మలో కోరికలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. అమ్మాయిలతో సరదాలను ఆస్వాదిస్తూ ముందుకు పోతున్నాడు. అసలు ఆర్జీవీ అనే వింత జీవికి ఏమైంది? గతంలో వర్మ తన మాటలతో రెచ్చిపోయేవాడు. కానీ ఈ మధ్య చేష్టలతో మితిమీరిపోతున్నాడు. వర్మ చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. […]