The Odyssey Twitter Review : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్, బ్రాండ్ ఇమేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన భారతదేశంలో కూడా ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. మన తెలుగు యువత అయితే ప్రేమగా ఆయన్ని ‘నోలన్ మామ’ అని పిలుస్తుంటారు. ఏ డైరెక్టర్ అయినా పెద్ద హిట్ కొట్టినా , ఆ డైరెక్టర్ పేరుకి చివర్లో ‘నోలన్’ అనే పదాన్ని జోడించి ట్వీట్లు వేయడం మీరంతా చూసే ఉంటారు. అప్పుడప్పుడు ట్రోల్ స్టఫ్ ఇచ్చే డైరెక్టర్స్ కి కూడా ఈ ట్యాగ్ ఇస్తూ వెటకారం చేస్తుంటారు. ఉదాహరణకు సోషల్ మీడియా లో ‘మెహర్ నోలన్’ అనే ట్యాగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూశాము. అలాంటి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ది ఒడిస్సీ’. నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ ద్వారా విడుదలైన ఈ చిత్రానికి ట్విట్టర్ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
#TheOdyssey Technically Brilliant, A True Cinematic Experience!
The first 30 minutes takes time to get going, but once Odysseus’ journey back begins, the film is exhilarating. Some sequences genuinely feel like a horror movie, while others play out like a proper commercial film.…
— Venky Reviews (@venkyreviews) July 17, 2026
ఈ రేంజ్ టాక్ ఈమధ్య కాలం లో మన ఇండియన్ సినిమాలకు కూడా రాలేదు అనే చెప్పాలి. టాక్ అద్భుతంగా రావడంతో , హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతున్నాయి. బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూస్తే , ఈ సినిమాకు నమోదైన హౌస్ ఫుల్స్ మనల్ని షాక్ కి గురి చేయక తప్పదు. సినిమా ఆరంభం అయ్యాక మొదటి 30 నిమిషాలు కథ చాలా గొప్పగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఒడియాసిస్ ప్రయాణం లో ప్రేక్షకులను కూడా లీనమయ్యేలా డైరెక్టర్ చేసారని అంటున్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు థియేటర్ లో అద్భుతమైన హారర్ మూవీ ఫీలింగ్ ని ఇచ్చిందని , అక్కడక్కడా కొన్ని చోట్ల సినిమా స్క్రీన్ ప్లే నెమ్మదించినా , చాలా ఎంగేజింగ్ గా అనిపించిందని అంటున్నారు.
After watching #TheOdyssey, here's what I think about #ChristopherNolan's filmography
Best – Interstellar
Worst – InsomniaUnderrated – Tenet
Overrated – NOT APPLICABLEDisappointment – Insomnia
Good surprise – Following pic.twitter.com/Ev9MAGoTjZ— Lakshman (@LakshmanOnX) July 17, 2026
ముఖ్యంగా టెక్నీకల్ గా ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ లాగా ఉందని అంటున్నారు. సౌండ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉందట. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని, ఓవరాల్ గా ఈ సినిమా అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇచ్చిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని చూసే ముందు , బ్యాక్ స్టోరీ తెలుసుకోవడం కోసం ‘ట్రాయ్ -ది ట్రోజన్ వార్’ చిత్రాన్ని కచ్చితంగా వీక్షించండి. ఆ చిత్రాన్ని చూసిన తర్వాత మీకు ఈ సినిమా ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓవరాల్ గా ట్విటర్ ఆడియన్స్ రియాక్షన్స్ కి సంబంధించిన ట్వీట్స్ కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
#TheOdyssey ✅✅✅☑️/5
Not disappointed, not blown away but loved the non linear screenplay and performance while similarities with #ThugLife pic.twitter.com/o7A0N03z2x— Ashok Surya (@AshokSuryaOff03) July 17, 2026
Most insanely amazing movie of this year has been watched #Theodyssey This movie is beyond ratings and stars Just go have fun at the cinemas man!! pic.twitter.com/3emTDTPMNO
— htapmaS (@trueindiangrit) July 17, 2026
