Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే అవకాశం దొరికినప్పుడు సినిమాలను చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే మీదట చేయబోయే సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే గత నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) అనే సినిమా సైతం ఇప్పటివరకు రిలీజ్ అయితే కాలేదు. ఇక ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తున్నప్పటికి సినిమాను అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడంలో మాత్రం వాళ్ళు ఫేయిల్ అవుతున్నారు. ఇక దాంతో మరోసారి సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని మార్చే ప్రయత్నంలో సినిమా మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ కి ఇంట్రెస్ట్ ఉందా? లేదా సినిమాని చేయాలనుకున్న అతను సినిమా కోసం కూడా డేట్స్ ని కేటాయించి తొందరగా షూటింగ్ పూర్తి చేసుకుంటే మిగిలిన వర్క్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు.
అలాకాకుండా ఏదో సమయం దొరికినప్పుడు షూటింగ్ చేయడం సినిమాల కోసం ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మళ్లీ ఆ డేట్ నా కాదు వేరే డేట్ లో ఈ సినిమా వస్తుంది అంటూ పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు చేయడం వల్ల సినిమాకి భారీగా నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా వస్తే చూడాలని అతని అభిమానులు చాలా వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికి సినిమాల విషయంలో ఆయన చేస్తున్న ఆలస్యం వల్ల సినిమాల మీద హైప్ తగ్గిపోవడమే కాకుండా ప్రేక్షకుల్లో కూడా అతన్ని స్క్రీన్ మీద చూడాలనే కోరిక రోజు రోజుకి సన్నగిల్లిందనే చెప్పాలి…
సినిమా చేసే ఇంట్రెస్ట్ లేకపోతే సినిమాని అప్పుడే ఆపేసి తన పని తను చేసుకుంటే అయిపోయేది ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఈ సినిమా వల్ల భారీగా నష్టాలు కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయట. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ బడ్జెట్లో కేటాయించిన ఏ ఏంరత్నం ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…