Vijay Devarakonda : పెళ్లిచూపులు(Pelli Chupulu) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మొదటి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నమైతే చేశాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆ తర్వాత సందీప్ రెడ్డివంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేసిన అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఓవర్ నైట్ లో విజయ్ దేవరకొండ ని స్టార్ హీరోని చేసేసింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా మంచి విజయాలను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ దూసుకెళ్తున్నాడు… గీత గోవిందం (Geetha Govindham) సినిమాతో మొదటిసారి 100 కోట్ల మార్కును టచ్ చేసిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత స్టార్ హీరో రేస్ లో ముందుకు దూసుకెళ్తాడని అందరు అనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో ఆయన కెరియర్ అనేది డైలామాలో పడింది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తేనే మరోసారి స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయడానికి అవకాశమైతే ఉంటుంది.
అయితే విజయ్ దేవరకొండ కి భారీగా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన సినిమాల్లో నోటా ఒకటి ఇక ఈ సినిమాతో పాటుగా భారీ అంచనాలతో వచ్చిన లైగర్ (Liger) అంతకుమించిన హైప్ తో రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా ఆకాశం ఎత్తులో ఉన్న క్రేజ్ అమాంతం పాతాళలోకానికి పడిపోయిందనే చెప్పాలి.
ఇక ఆ తర్వాత చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. దాంతో తన పంథా ను మార్చి ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి ఒక డిఫరెంట్ సినిమాని చేస్తున్నాడు. కింగ్ డమ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తున్న ఈ టీజర్ సినిమా మీద భారీ హైప్ ను పెంచుతుంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక భారీ సక్సెస్ ని సాధిస్తాడు అంటూ ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం విశేషం… ఇక తన తోటి హీరోలందరు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంటే విజయ్ మాత్రం వరుస డిజస్టర్లను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇక మీదట నుంచి ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…