Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందాన మేనేజర్ చేతిలో ఘోరంగా మోసపోయినట్లు తెలుస్తుంది. దాంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుందట. రష్మిక వద్ద చాలా కాలంగా పని చేస్తున్న మేనేజర్ కి ఆమె అన్ని బాధ్యతలు అప్పగించారు. డేట్స్, అకౌంట్స్ ఆయనే చూసుకుంటాడట. సదరు మేనేజర్ రష్మిక వద్ద రూ. 80 లక్షల వరకు దొంగిలించాడట. ఆ విషయం తెలిసిన రష్మిక మేనేజర్ ని పని నుండి తీసేశారట. అయితే ఎలాంటి కేసు పెట్టలేదట. ఈ విషయాన్ని రాద్ధాంతం చేయడం ఇష్టం లేక వదిలేశారు. బయట వ్యక్తులను మేనేజర్స్ గా పెట్టుకుంటే మోసం చేస్తున్నారని, ఇకపై తన విషయాలన్నీ తానే స్వయంగా చూసుకోవాలని అనుకుంటున్నారట.
ఇకపై డేట్స్, అకౌంట్స్, ప్రోగ్రామ్స్ స్వయంగా చూసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో ఎదిగారు. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. ఆ దెబ్బతో ఆమె తిరుగులేని హీరోయిన్ అయ్యారు. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఆమె ఫేమ్ రాబట్టారు. నేషనల్ క్రష్ గా అవతరించింది.
ప్రస్తుతం రష్మిక పుష్ప 2లో నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. నిరవధికంగా పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం కలదంటున్నారు. అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన పుష్ప చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 2 తెరకెక్కుతుంది. అల్లు అర్జున్, రష్మిక మందాన మరోసారి జతకట్టనున్నారు. ఈ వైడ్ అంచనాలు ఉన్నాయి.
రష్మిక చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ యానిమల్. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు.గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇటీవల స్మాల్ ప్రోమో విడుదల చేశారు. ఆది ఆకట్టుకుంది. వైలెంట్ మూవీ అంటే ఎలా ఉంటుందో యానిమల్ చిత్రంతో చూపించబోతున్నానని సందీప్ రెడ్డి కామెంట్ చేయడం విశేషం. ఇక పుష్ప, యానిమల్ చిత్రాలతో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.