Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘పుష్ప 2’ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేపట్టే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించాలని అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు భావిస్తున్నారు. అందుకే తమదైన రీతిలో సినిమాలని చేసిన సక్సెస్ ఫుల్ గా నిలిపే ప్లాన్ చేసుకుంటూ ఈ సినిమాలో ఏ మిస్టేక్ లేకుండా చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక సుకుమార్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు అనే దాని మీదనే గత కొద్దిరోజుల నుంచి చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. నిజానికి సునీల్, అనసూయ, ఫాహాద్ ఫజిల్ లాంటి క్యారెక్టర్లు విలన్ గా చాలా మంచి పాత్రలను పోషిస్తున్నప్పటికి మెయిన్ విలను ఎవరు అనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంటుంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనసూయ మెయిన్ విపన్ గా కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి దానికి అనుగుణంగానే ఆమె పాత్రను డిజైన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మొదటి పార్ట్ లో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ అయితే లేదు. కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం ఆమె పాత్ర ను హైలెట్ చేస్తూ సుకుమార్ చాలా సీన్లు రాసుకున్నాడట.
ఇక ఇంటర్వెల్ లో గానీ, క్లైమాక్స్ లో గానీ వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులందరిలో థ్రిల్ కలిగిస్తుందని అలాగే అనసూయ చేయబోయే నటన పట్ల కూడా చాలామంది ప్రేక్షకులు చాలా రకాల కాంప్లిమెంట్స్ ని కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సుకుమార్ రెడీ అవుతున్నాడు.
ఇక రంగస్థలం సినిమాలో ఏ విధంగా అయితే చివర్లో ప్రకాష్ రాజ్ విలన్ అని రివిల్ చేశాడో అదే విధంగా ఈ సినిమాతో కూడా అలాంటి ఒక మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి ని పెంచడంలో చాలా వరకు కృషి చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు పుష్ప 2 సినిమాకి బాలీవుడ్ లో భారీ బజ్ అయితే ఉంది.