Tollywood: తెలుగు వెండితెరపై రొమాన్స్ పరిధి దాటిందా ? ఒకప్పుడు వ్యాంప్ పాత్రలు చేసే నటీమణులే అందాల ఆరబోతకు ఆసక్తి చూపించే వాళ్ళు. కానీ కాలం మారింది, జనరేషన్స్ మారాయి. దాంతో ప్రస్తుత హీరోయిన్లు కొన్ని మితి మీరిన రొమాంటిక్ సీన్స్ చేయడానికి బాగా అలవాటు పడ్డారు. మరి ఆ సీన్స్ సమాజం మీద ప్రభావం చూపుతున్నాయా ? అసలు ఈ హీరోయిన్లు ఎందుకు ఇంతగా దిగజారిపోతున్నారు ? డబ్బు కోసమా, లేక ఆఫర్ల కోసమా ?

పాతకాలం హీరోయిన్ల విషయానికి వద్దాం. భానుమతి గారు, అంజలి గారు, సావిత్రి, జమున, జయలలిత ఇలా అప్పటి ప్రతి హీరోయిన్ బోల్డ్ గా నటించారు. కానీ అలా నిజంగా నటించలేదు. కెమెరా పనితనంతో వారిని అలా చూపించారు. కానీ, ఎన్నడూ వాళ్ళు తమ పరిధి దాటలేదు. పైగా నటనకు అవకాశం ఉన్న సినిమాలు చేశారు.
అలాగే అప్పటి దర్శక రచయితలు కూడా హీరోకి సమానంగా ఉండే పాత్రలను హీరోయిన్ల కోసం రాసేవారు. అంతెందుకు శ్రీదేవి, విజయశాంతి, రమ్యకృష్ణ, సౌందర్య లాంటి నిన్నటి తరం హీరోయిన్ల వరకు కూడా మంచి పాత్రలు ఉండేవి. ఉదాహరణకు నరసింహా లో నీలాంబరి పాత్ర తీసుకోండి. రజినీకాంత్ నే డామినేట్ చేసేంత చక్కగా ఆ పాత్రను మలిచారు.
Also Read: మరో వ్యాపారంలోకి అడుగు పెట్టిన లేడీ సూపర్ స్టార్… నయనతార
అదే రమ్యకృష్ణ శ్యామల, అమ్మోరు వంటి నటనకు ఆస్కారం ఉన్న ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. మరి ఈ రోజుల్లో ఎంతమంది హీరోయిన్లకు అలాంటి అవకాశాలు వస్తున్నాయి. అసలు హీరోయిన్లు అంటే కేవలం వాళ్ళు పాటల కోసం, రెండు ముద్దు సీన్లు కోసం, మూడు ఎక్స్ పోజింగ్ సీన్ల కోసం మాత్రమే అనే లెక్క బలపడిపోయింది.
ఈ హీరోయిన్లు కూడా ఉన్న టైమ్ లో డబ్బు సంపాదించుకోడం, ఒక మంచి బిజినెస్ మెన్ చూసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడమే తమ ప్రధాన టార్గెట్ అయిపోయింది. గొప్ప పాత్రలు చేద్దాం, గొప్ప నటిగా పేరు తెచ్చుకుందాం అనే ఆలోచన కూడా ప్రస్తుతం ఉన్న ఏ హీరోయిన్ కి రావడం లేదు. దీనికితోడు సోషల్ మీడియాలో వీళ్ళ వెక్కిలి వేషాలు, బోల్డ్ ఫోజులు.. ఇక మధ్యలో షాపింగ్ మాల్ ఓపెనింగ్స్.. ఆ సంపాదన తప్ప మరొక ఆలోచించరు. అందుకే తెలుగు తెర పై హీరోయిన్ స్థాయి పడిపోయింది.
Also Read: వెండితెరకు పరిచయం కానున్న అతిలోక సుందరి శ్రీదేవి మేనకోడలు…