https://oktelugu.com/

The Kerala Story Movie Review : ‘ది కేరళ స్టోరీ’ మూవీ ఫుల్ రివ్యూ

ప్రతీ ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది,ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది ఈ చిత్రం.మతాలను అడ్డుపెట్టుకొని కొంతమంది దుర్మార్గులు చేస్తున్న పనులను కళ్ళకి కట్టినట్టు చూపించాడు డైరెక్టర్.

Written By:
  • NARESH
  • , Updated On : May 6, 2023 8:45 pm
    Follow us on

    The Kerala Story Movie Review : యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమాలు ఈ మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఉదాహరణకి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాని తీసుకుందాం. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు.  ఆర్టికల్ 370 ని భారత ప్రభుత్వం రద్దు సమంజసమే అన్నట్టుగా డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఫోకస్ చేశాడు. జరిగిన కథని ఎలాంటి మార్పు లేకుండా నిఖచ్చిగా చూపించడంతో ఈ సినిమా 400 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ కూడా అదే తరహాలోని సినిమా. ఈ చిత్రం విడుదలపై ఎన్నో సంఘాలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాయి. కానీ కోర్టు మాత్రం ఈ చిత్రం విడుదల అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి ఈ సినిమా కథ ఏమిటో, దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంత చక్కగా తీసాడో   రివ్యూ లోకి వెళ్లి చూద్దాము.

    కథ :

    కొంతమంది మతవాదుల ప్రలోభాలకు ఆకర్షితులై ముగ్గురు నర్సింగ్ యువతులు ఇస్లాం మతం లోకి మారుతారు.వాళ్ళని అలా ప్రలోభ పెట్టి మతాన్ని మరిపించేలా చేసింది టెర్రరిస్ట్స్ అనే విషయం ఆ ముగ్గురు యువతులకు తెలియదు.మతాన్ని మార్చుకున్న ఆ ముగ్గురు యువతులను ISIS టెర్రరిస్టు గ్రూప్ లోకి బలవంతంగా పంపబడుతారు.ఈ ముగ్గురు యువతులు ఎలా అయినా ఈ గ్రూప్ నుండి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసి, అక్కడి నుండి బయటపడి మన దేశం లోకి అడుగుపెడతారు.ఇక్కడికి రాగానే పోలీసులు ఈ ముగ్గురు యువతులను అరెస్ట్ చేస్తారు, పోలీసు అధికారులకు తాము ఎలా మోసానికి గురై ఆ గ్రూప్ లోకి వెళ్లాల్సి వచ్చిందో, ఆ తర్వాత టెర్రరిస్ట్స్ నుండి ఎలాంటి చిత్రహింసలు అనుభవించాల్సి వచ్చిందో చెప్పుకోవడం తో ఈ కథ మొదలు అవుతుంది.

    విశ్లేషణ :

    ఈ చిత్రం లో డైరెక్టర్ ఎక్కడ కూడా కేరళ నుండి 32 వేల మంది యువతులు ISIS టెర్రరిస్ట్ గ్రూప్ లోకి చేరినట్టు  చూపించలేదు. కేవలం ముగ్గురు యువతులు టెర్రరిస్టు గ్రూప్ లో వంచనకు గురై  అడుగుపెట్టి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఎన్ని చిత్రహింసలు అనుభవించాల్సి వచ్చింది అనేది మాత్రమే చూపించాడు డైరెక్టర్ సుదీప్తో సేన్.ఇలాంటి సెన్సిటివ్ కథ లో ఎక్కడ కూడా ఆయన ఒక మతాన్ని కించపర్చడం కానీ,తగ్గించి చూపించడం కానీ చేయలేదు.కత్తి మీద సాము లాంటి ఈ సున్నితమైన అంశాన్ని తీసుకొని, ప్రేక్షకుల హృదయాల్ని కదిలించే విధంగా తీయడం అనేది సాధారణమైన విషయం కాదు.ఎవరినీ రెచ్చగొట్టే విధంగా లేదు కాబట్టే, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి అనుమతిని ఇచ్చింది, కోర్టు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తపర్చలేదు.

    ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రముఖ హీరోయిన్ అదా శర్మ ఇంత అద్భుతంగా నటించగలదు అనే విషయం ఈ సినిమాని చూసినప్పుడే అర్థం అయ్యింది.ఈమెతో పాటుగా నటించిన మిగిలిన ఇద్దరు అమ్మాయి యోగితా , బిహానీలు కూడా ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా చేసారు.ముఖ్యంగా అదా శర్మకి ఈ చిత్రం పెద్ద బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నాళ్లు అయినా ఆమెకి ఇలాంటి సబ్జెక్టు లో నటించే అవకాశం దక్కలేదు, ఇప్పుడు చేతికి వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.ఈ సినిమాలో ఉన్న ఏకైక మైనస్ ఒక్కటే, అది సినిమాటోగ్రఫీ.బడ్జెట్ లేకుండా తీసిన చిత్రం కాబట్టి ఇంతకు మించి క్వాలిటీ ని ఆశించలేమని చెప్పొచ్చు.

    చివరిమాట:

    ప్రతీ ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది,ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది ఈ చిత్రం.మతాలను అడ్డుపెట్టుకొని కొంతమంది దుర్మార్గులు చేస్తున్న పనులను కళ్ళకి కట్టినట్టు చూపించాడు డైరెక్టర్.

    రేటింగ్ : 3.5/5

    The Kerala Story Official Trailer | Vipul Amrutlal Shah | Sudipto Sen | Adah Sharma | Aashin A Shah