Jailer: జైలర్ పై పడిన బిగ్ బాస్ ప్రభావం.. ఈ రేంజ్ లో దెబ్బ కొట్టిందా?

దీపావళి రోజు ప్రేక్షకులకు టీవీ పండగ కూడా నడిచిందనే చెప్పాలి. ఓ వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైతే.. మరో వైపు బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారమైంది.

Written By: Suresh, Updated On : November 14, 2023 11:14 am

Jailer

Follow us on

Jailer: కొన్ని సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయినా టీవీలో మాత్రం తక్కువ టీఆర్పీని సొంతం చేసుకుంటాయి. థియేటర్ లో వచ్చిన కిక్ టీవీలో ఉండదు అనే చెప్పాలి. ఇక కొత్త సినిమాలు పండుగల పూట థియేటర్లలో వస్తుంటాయి. అదే విధంగా బుల్లితెరపై కూడా పండగ పూట కొత్త సినిమాలను రిలీజ్ చేయాలి అనుకుంటారు యాజమాన్యం. అదే విధంగా రిలీజ్ చేస్తుంటారు కూడా. రీసెంట్ గా దసరా సందర్బంగా వాల్తేరు వీరయ్య సినిమాను ప్రసారం చేశారు. కానీ ఈ సినిమాకు రేటింగ్ రాలేదు. అయితే దీపావళి సందర్బంగా మరో సూపర్ హిట్ సినిమాను రిలీజ్ చేశారు జెమిని టీవీ యాజమాన్యం. మరి ఈ సినిమా రేటింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

దీపావళి రోజు ప్రేక్షకులకు టీవీ పండగ కూడా నడిచిందనే చెప్పాలి. ఓ వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైతే.. మరో వైపు బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారమైంది. అయినా బిగ్ బాస్ ఎప్పటి నుంచో ప్రసారం అవుతుంది అందులో వింత ఏంటి అనుకుంటున్నారా? దీపావళి రోజు స్పెషల్ ఎపిసోడ్ ను ప్రసారం చేశారు మేకర్స్. దీంతో ప్రేక్షకులకు ఈ రెండింటిలో దేన్ని చూడాలో అర్థం కాలేదట. బ్రేక్ వచ్చే వరకు జైలర్ చూసే వాళ్ళు కొంతమంది, బ్రేక్ తర్వాత బిగ్ బాస్ చూసే వారు మరికొందరు అన్నట్టుగా సాగింది.

ఈ రెండింటిలో జైలర్ కంటే బిగ్ బాస్ ముందుందట. బిగ్ బాస్ నే వీక్షించారట ప్రేక్షకులు. అంటే బిగ్ బాస్ ప్రభావం జైలర్ సినిమాపై ఎక్కువగానే పడిందని బార్క్ సంస్థ తెలిపింది. ఈ మధ్య కాలంలో జెమిని టీవీలో ప్రసారమయ్యే సినిమాలకు టీఆర్పీ రేటింగ్స్ తక్కువ వస్తున్నాయి. రీసెంట్ గా టెలికాస్ట్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా చాలా తక్కువ రేటింగ్ ను పొందింది. అదే విధంగా ఓ వైపు బిగ్ బాస్ మరోవైపు జైలర్ అంటే ఎక్కువ ఓట్లు మాత్రం బిగ్ బాస్ కే పడ్డాయని తెలుస్తోంది. దీంతో జైలర్ రేటింగ్ తగ్గి, బిగ్ బాస్ రేటింగ్ మాత్రం ఫుల్ గా ఉందని టాక్.

ఇక జైలర్ సినిమా థియేటర్లలో దుమ్ము లేపింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్లు సాధించింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఇలాంటి సినిమా టీవీలో మాత్రం మెప్పించలేకపోయింది. జైలర్ టీఆర్పీ రేటింగ్ తక్కువగా ఉంటే.. బిగ్ బాస్ రేటింగ్ మాత్రం 9కి పైగా వచ్చే అవకాశం ఉందని టాక్. వీటి రేటింగ్స్ అధికారికంగా వచ్చే వారం విడుదల కానున్నాయి.