Tripti Dimri: యానిమల్ మూవీ లేటెస్ట్ సెన్సేషన్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ బాక్సాఫీస్ దున్నేస్తుంది. రూ. 500 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. సక్సెస్ తో పాటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మితిమీరిన సెక్స్, వైలెన్స్ తో కూడిన యానిమల్ ఓ చెత్త మూవీ అంటూ పలువురు అభివర్ణిస్తున్నారు. మరికొందరు మూవీ ఆఫ్ ది ఇయర్. మా మైండ్స్ నుండి పోవడం లేదు. ప్రతి సీన్ గూస్ బంప్స్ కలిగించిందని కామెంట్ చేస్తున్నారు.
విమర్శించినా ప్రశంసించినా సినిమాకు కావాల్సింది కమర్షియల్ సక్సెస్. అది యానిమల్ సాధించింది. యానిమల్ మూవీతో రన్బీర్ కపూర్, బాబీ డియోల్, సందీవ్ రెడ్డి వంగ పేర్లు మారుమ్రోగుతున్నాయి. వీరితో పాటు మరోపేరు సంచలనంగా మారింది. యానిమల్ విడుదల నాటి నుండి హీరోయిన్ త్రిప్తి దిమ్రి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. కారణం యానిమల్ చిత్రంలో ఆమె న్యూడ్ గా శృంగార సన్నివేశం చేసింది.
హీరో రన్బీర్ కపూర్-త్రిప్తి దిమ్రి సన్నివేశం కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది. ఇంత బోల్డ్ గా నటించిన హీరోయిన్ ఎవరనే చర్చ గట్టిగా నడుస్తుంది. గతంలో కొన్ని క్లాసిక్ రోల్స్ చేసిన త్రిప్తి నుండి ఊహించని పరిణామం అంటున్నారు. ఇదిలా ఉంటే ఈమెకు తెలుగులో బంపర్ ఛాన్స్ తగిలిందట. ఏకంగా రవితేజ సరసన నటిస్తుందట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
రవితేజ నెక్స్ట్ దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ చిత్రానికి కమిట్ అయ్యారని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అయ్యిందట. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిప్తి పేరు పరిశీలనలో ఉందట. త్రిప్తి దిమ్రి రవితేజకు జంటగా నటించడం ఖాయం అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి అదే జరిగితే త్రిప్తి తెలుగులో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. అనిల్ రావిపూడి అంటే హిట్ గ్యారెంటీ డైరెక్టర్. కాబట్టి ఆమెకు తెలుగులో మంచి ఆరంభం దొరికినట్లే…