Bhumika Chawla: వయసులో ఉన్న కుర్రాళ్లతో రొమాన్స్ చేస్తే తప్పేముంది… 40 ఏళ్ల వయసులో భూమిక క్రేజీ కోరిక!

వెంకటేష్ భార్యగా భూమిక నటించారు. ఈ సందర్భంగా భూమిక పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ 40 ఏళ్ల హీరోయిన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ కంటే చిన్నవాళ్ళైన అబ్బాయిలతో రొమాన్స్ చేస్తే తప్పేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు.

Written By: Shiva, Updated On : April 29, 2023 8:15 am
Follow us on

Bhumika Chawla: భూమిక చావ్లా సెకండ్ ఇన్నింగ్స్ లో కొనసాగుతున్నారు. కెరీర్ బిగినింగ్ లో భూమిక టాలీవుడ్ ని షేక్ చేసింది. పలు ఇండస్ట్రీ హిట్స్ లో నటించింది. భూమిక హీరోయిన్ గా నటించిన ఖుషి, ఒక్కడు, సింహాద్రి బాక్సాఫీస్ బద్దలు కొట్టాయి. ఆ దెబ్బతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అవతరించారు. కెరీర్ పీక్స్ లో ఉండగా మిస్సమ్మ వంటి ప్రయోగాత్మక చిత్రం కూడా చేసింది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. ఆమె రీసెంట్ మూవీ కిసీ కాగా భాయ్ కిసీ కీ జాన్. సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో వెంకటేష్ కీలక రోల్ చేశారు.

వెంకటేష్ భార్యగా భూమిక నటించారు. ఈ సందర్భంగా భూమిక పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ 40 ఏళ్ల హీరోయిన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ కంటే చిన్నవాళ్ళైన అబ్బాయిలతో రొమాన్స్ చేస్తే తప్పేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. మలైకా అరోరా-అర్జున్ కపూర్, ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ రిలేషన్ ని జనాలు ఎందుకు ఒప్పుకోవడం లేదు. వారిని ఎందుకు భిన్నంగా చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హీరో తమ కంటే సగం వయసున్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు.

అలాంటప్పుడు నేను కూడా ఒక హ్యాండ్సమ్ హీరోతో రొమాన్స్ చేస్తాను. మగవారు అలా చేస్తున్నపుడు ఆడవాళ్లు చేయడంలో తప్పేముంది… అంటూ భూమిక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మగాళ్లకు ఒక న్యాయం ఆడవాళ్లకు ఒక న్యాయమా అని భూమిక ప్రశ్నించారు. భూమిక బాలీవుడ్ మీద కూడా కొన్ని ఆరోపణలు చేయడం విశేషం. సల్మాన్ ఖాన్ కి జంటగా నటించిన తేరే నామ్ మూవీ హిట్ కావడంతో బాలీవుడ్ లో ఆమెకు ఆఫర్స్ వచ్చాయట. అయితే సైన్ చేశాక ఆ ప్రాజెక్ట్స్ నుండి తప్పించారట.

ఓ బడా నిర్మాణ సంస్థలో ఆఫర్ రాగా దాని కోసం మిగతా ఆఫర్స్ వదులుకున్నదట. నిర్మాత మారడంతో ఆ ప్రాజెక్ట్ నుండి హీరోతో పాటు తనను కూడా పక్కన పెట్టారట. జబ్ వి మెట్ చిత్రంలో బాబు డియోల్, భూమిక నటించాల్సి ఉందట. వారిద్దరినీ తప్పించి షాహిద్ కపూర్, కరీనా కపూర్ లను తీసుకున్నారట. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రం నుండి కూడా తనని తప్పించినట్లు భూమిక వెల్లడించారు.