https://oktelugu.com/

Bro Vs Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సీనే బ్రో విషయంలో రిపీట్ కానుందా?

మెగా ఫ్యాన్సే అలా అనుకుంటే ఇంక సాధారణ ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. సాధారణ ప్రేక్షకులకి ఈ చిత్రాల పైన మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా లేకుండా పోయాయి. దానికి తోడు ఇద్దరు హీరోలు ముందు వచ్చిన సినిమాలు కేవలం యవరేజ్ సినిమాలు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 28, 2023 / 03:02 PM IST

    Bro Vs Waltair Veerayya

    Follow us on

    Bro Vs Waltair Veerayya: మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా బ్రో సినిమా ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. మొదటిసారి మామ – అల్లుడు, పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా తమిళ సినిమా వినోదయ సీతమ్ కి రీమేక్. ఇక ఈ సినిమాకి ఉదయం నుంచి వస్తున్న రివ్యూస్ చూస్తే, వాల్తేరు వీరయ్య కి ఏమి జరిగిందో ఈ సినిమాకి కూడా అదే జరగబోతోంది అని అర్థమవుతోంది.

    అసలు విషయానికి వస్తే, బ్రో సినిమాకి వాల్తేరు వీరయ్య చిత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే.. రెండు సినిమాలకి కూడా విడుదలకు ముందు చెప్పలేనంత నెగిటివిటీ ఉంది. రెండు సినిమాల పైన కూడా ప్రేక్షకులకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. దానికి తగ్గట్టుగానే సినిమా విడుదలకు ముందు ఈ రెండు చిత్రాల నుంచి విడుదలైన పాటలు అలానే టీజర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

    అంతెందుకు మెగా ఫ్యాన్స్ కూడా ఈ రెండు సినిమాల పైన అంచనాలు తగ్గించుకునేశారు. ఇవి హిట్ అయ్యే సినిమాలు కావు అని విడుదలకు ముందే ఫిక్స్ అయ్యారు. మెగా ఫ్యాన్సే అలా అనుకుంటే ఇంక సాధారణ ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. సాధారణ ప్రేక్షకులకి ఈ చిత్రాల పైన మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా లేకుండా పోయాయి. దానికి తోడు ఇద్దరు హీరోలు ముందు వచ్చిన సినిమాలు కేవలం యవరేజ్ సినిమాలు. గాడ్ ఫాదర్ అలానే భీమ్లా నాయక్ రెండు కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సూపర్ హిట్లు గా అయితే నిలువలేదు.

    అయితే ఇన్ని ఆటంకాల మధ్య విడుదలైన ఈ రెండు చిత్రాలలో మొదటి చిత్రం వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఏమి విజయం సాధిస్తుందిలే అనుకున్న వారిని ఆశ్చర్యపరిస్తూ చిరంజీవి కెరియర్ లోనే వన్ ఆఫ్ట డ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఇదే బ్రో విషయంలో కూడా రిపీట్ కాబోతోంది అని ధైర్యంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకు అంటే ఉదయం నుంచి చూస్తే థియేటర్స్ దగ్గర మెగా ఫాన్స్ సందడి అలా ఇలా లేదు. అంతేకాకుండా సినిమా చూసిన వారు అందరూ కూడా ఈ మధ్యకాలంలో చూడని పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో చూసాము అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    వాల్తేరు వీరయ్యలో వింటేజ్ చిరంజీవిని దర్శకుడు చూపించిన సంగతి తెలిసిందే. ఇక అలానే ఇప్పుడు బ్రో చిత్రంలో కూడా వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారట. లుక్స్ పరంగా కానీ ఎనర్జీ పరంగా కానీ కామెడీ టైమింగ్ పరంగా కానీ, వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి ఎలా అయితే మ్యాజిక్ చేశారో.. బ్రో సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ అలానే మ్యాజిక్ చేశారు అని బయట టాక్. అంతేకాదు వాల్తేరు వీరయ్య లో రవితేజ క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో, బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్ క్యారెక్టర్ కూడా అలానే ఉందట.

    మొత్తానికి అన్న, తమ్ముడు ఒకే సంవత్సరం ఒకే రకంగా సూపర్ హిట్లు కొట్టేశారు అని ఆనందపడిపోతున్నారు మెగా ఫ్యాన్స్. మరి బ్రో సినిమా వాల్తేరు వీరయ్య లాగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న లేదో తెలియాలి అంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.