Harsha Sai: సినిమాలతోపాటు, ప్రముఖులపై ఇటీవలై లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. హీరో రాజ్‌తరుణ, లావణ్య ఎపిసోడ్‌తో మొదలై.. ప్రస్తుతం ఫోక్ సింగర్, రైటర్ మల్లిక్ తేజ వరకు ఇలాంటి కేసులే నమోదయ్యాయి. రాజ్‌తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ కూడా వేశారు. ఇక డ్యాన్సర్ జానీ మాస్టర్‌పై అతని అసిస్టెంట్ కూడా ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్నాడని, ఔట్‌డోర్ షూటింగ్‌లలో లైంగికదాడి చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో వారం రోజులు జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలించి అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ కస్టడీ కోరి మరోమారు విచారణ చేశారు. జానీ మాస్టర్ నేరం అంగీకరించాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే. యూట్యూబర్ హర్షసాయి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతనిపై ఓ నటి వారం క్రితం ఫిర్యాదు చేసింది. ప్రేమ, పెళ్లి పేరుతో రూ.2 కోట్లు తీసుకున్నాడని, డబ్బులు ఇవ్వడం లేదని, పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. నిన్నటి వరకు మంచితనం, మానవత్వం, దయాగుణంవ వంటి ట్యాగ్స్ తగిలించుకున్న హర్షసాయి లైంగికదాడి ఆరోపణలతో విలన్ అయ్యాడు. యువతిని వంచించి వంచకుడయ్యాడు. తనకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేశాడని, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు ఇప్పటికీ అతడిని పట్టుకోలేదు. దీంతో హర్షసాయి ఎక్కడున్నాడన్న ప్రశ్న మొదలైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న అతను పోలీసులకు చిక్కకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆడియో లీకులు..
పోలీసులకు చిక్కని హర్షసాయి ఆడియో లీకులు, పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా పోలీసులు అతడిని పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కావాలనే జాప్యం చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతను ఎందుకు దొరకడం లేదని చాలా మంది గుసగుసలాడుతున్నారు. జానీ మాస్టర్‌ను నాలుగైదు రోజుల్లోనే పట్టుకున్న నార్సింగ్ పోలీసులు హర్షసాయిని ఎందుకు పట్టుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో బాధితురాలు హర్షసాయి విదేశీలకు పారిపోయే ఆలోచనలో ఉన్నాడని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే జరిగితే అతను చిక్కడం కష్టం.
బయటకు వస్తున్న బాధితులు..
ఇదిలా ఉంటే హర్షసాయి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వివాదాల డొంక కదులుతోంది. అతడిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గేమ్ యాక్టింగ్‌ను ఉల్లంఘించాడని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదులు వచ్చాయి. ఏపీలోనూ బాధితులు క్యూ కడుతున్నారు. అతను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్‌తో నష్టపోయామని ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా హర్షసాయి ఫైండేషన్‌పై కేసు నమోదైంది. సహాయం కోసం రూ.5.4 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని బాధితడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫౌండేషన్‌పై పలు సెక్షన్ల కింద కేసే నమోదు చేశారు.
పరారీలో ఫ్యామిలీ..
హర్యషాయితోపాటు అతని కుటుంబం మొత్తం ప్రస్తుతం పరారీలో ఉంది. కాగా, తనపై వస్తున్న ఆరోపణలను హర్షసాయి కొట్టేశాడు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. అడ్వకేట్‌ను రంగంలోకి దింపాడు. కానీ ఎప్పుడు బయటకు వస్తాడో చెప్పడం లేదు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The fact that the police did not catch harshasai raises suspicions
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com